- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Andhrapradesh:అపరకాళీలాగా మారిన అంగన్ వాడీలు..31వ రోజు కొనసాగిన సమ్మె
దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో డిమాండ్ల సాధన మేరకు సమ్మె చేపట్టిన అంగన్వాడీలు ప్రభుత్వం ఎస్మా ప్రయోగించిన భయపడకుండా ప్రభుత్వం దిగివచ్చి తమ డిమాండ్లను నెరవేర్చేవరకు తగ్గేదేలే అంటున్నారు. ఈ నేపథ్యంలో అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 31వ రోజు కూడా కొనసాగింది. ఇక 31వ రోజు కొనసాగిన సమ్మెలో అంగన్వాడీలు అపరాకాళిలై కదం తొక్కారు. నిత్యం నిరసనలతో, ధర్నాలతో ప్రభుత్వానికి పట్టపగలే చుక్కలు చూపించారు. తాము అడుగుతున్న డిమాండ్లు న్యాయబద్ధమైనవని.. ఆ డిమాండ్లను అంగీకరించకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే సహించేదే లేదని..సమ్మెను విరమించుకునే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.
ఇక 31వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిన సమ్మెలో అంగన్వాడీలు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చెప్పట్టారు. కోనసీమ జిల్లా లోని ముమ్మిడివరం లో సమ్మె చేపట్టిన అంగన్వాడీలు దీక్షా శిబిరంలో చిన్నారులకు పుట్టినరోజు వేడుకలు, అన్నప్రాసన, పౌష్ఠికాహారం అందించి నిరసన తెలిపారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లను నెరవేరుస్తామని స్పష్టమైన హామీ ఇవ్వాలని.. లేని పక్షంలో ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని విజయవాడలో అంగన్వాడీలు హెచ్చరించారు.
అలానే గుంటూరు జిల్లా మంగళగిరి లోనూ అంగన్వాడి కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. తెనాలిలో ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అంగన్వాడీలు కుర్చీలు నెత్తిన పెట్టుకుని నిరసన తెలిపారు. ఇక కర్నూలులో అంగన్వాడీలకు మద్దతుగా వామపక్ష నాయకులు నిలిచారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుంటే అన్ని రాజకీయ పార్టీలతో కలిసి రాష్ట్ర బందుకు పిలుపునిస్తామని హెచ్చరించారు.
ఇక కడపలో అంగన్వాడీలు చప్పట్లు కొడుతూ..ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాల చేస్తూ నిరసన తెలపగా.. Y.S.R. జిల్లా బద్వేలులో అంగన్వాడీ కార్యకర్తలు మెడకు ఉరితాడు వేసుకొని నిరసన చేపట్టారు. అన్నమయ్య జిల్లా రాయచోటి లో ఇదే పరిస్థితి నెలకొంది. దీక్షా శిబిరం వద్ద అర్ధరాత్రి వేళ అంగన్వాడీలు ఆటలాడుతూ, పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ నిరసన తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో అంగన్వాడీ కార్యకర్తలు జగన్ చిత్రపటం ముందు దీపాలు వెలిగించి నిరసన వ్యక్తం చేశారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 31 వ రోజు నిరసనలు కొనసాగాయి.