Big Breaking: అనూహ్యంగా ఆధిక్యంలో టీడీపీ.. పశ్చిమ రాయలసీమ కూడా..!

by Disha Web |
Big Breaking: అనూహ్యంగా ఆధిక్యంలో టీడీపీ.. పశ్చిమ రాయలసీమ కూడా..!
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం కాసేపట్లో తెలిపోనుంది. ఈ నెల 13న ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరిగింది. ప్రస్తుతం లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో అనూహ్యంగా టీడీపీ పుంజుకుంది. టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి 1000కి పైగా ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఆధిక్యంలో కొనసాగిన వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో వెనకబడ్డారు. బీజేపీకి వచ్చిన ఓట్ల షేర్‌తో టీడీపీ ఆధిక్యంలోకి వచ్చింది. ప్రస్తుతం పీడీఎఫ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

కాగా తూర్పు రాయలసీమ, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ రెండు చోట్ల కూడా వైసీపీ ఓటమి పాలైంది.



Next Story