తెలుగుదేశం పార్టీ తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం:మాజీ మంత్రి పరిటాల సునీత

by Disha Web Desk 18 |
తెలుగుదేశం పార్టీ తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం:మాజీ మంత్రి పరిటాల సునీత
X

దిశ ప్రతినిధి, అనంతపురం: వైసీపీ ప్రభుత్వంలో సర్పంచ్ నుంచి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు వరకు అంతా అప్పుల పాలయ్యారని.. ఆ పార్టీని నమ్ముకున్న నాయకులంతా రోడ్డు మీదకు వచ్చారని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. బాబు సూపర్ సిక్స్ కార్యక్రమంలో భాగంగా ఆమె అనంతపురం రూరల్ పరిధిలోని మన్నీల గ్రామం లో పర్యటించారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆమెకు ఘన స్వాగతం పలికారు. భారీ ఊరేగింపుగా గ్రామంలోకి ఆహ్వానించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మండల సర్పంచ్ అల్లు త్రిలోక్ నాయుడు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. ఆయనతో పాటు మరో 11 కుటుంబాల వారు కూడా వైసీపీ కి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. వీరిందరికీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి సునీత ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం లో గ్రామంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏదైనా పని చేయాలంటే ఎమ్మెల్యే చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కనీసం గ్రామాలకు నిధులు ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేశారన్నారు. సర్పంచ్ నిధులను సైతం పక్కదారి పట్టించారని విమర్శలు చేశారు. గతంలో తెలుగుదేశం పార్టీ హయంలో గ్రామాల్లో మంచి అభివృద్ధి జరిగిందని వారు అభిప్రాయపడ్డారు. అందుకే పరిటాల సునీత నాయకత్వంలో గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతోనే పార్టీలోకి చేరినట్లు వివరించారు. మరోవైపు మాజీ మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఆస్తులను సైతం అమ్ముకొని పనిచేసిన వారు కూడా నేడు రోడ్డు మీదకు వచ్చారని అన్నారు. ఇక ఎంతో ఖర్చు చేసి గెలిచిన వారు కూడా కనీసం ఒక్క పని చేయలేకపోతున్నారన్నారు. గ్రామాల్లో ఎంతో నమ్మకంతో ప్రజలు ఓట్లు వేసి ఉంటారని అలాంటి సమయంలో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు ప్రభుత్వం నిధులు విడుదల చేయక వారు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారన్నారు. కొంతమంది సొంత ఖర్చులతో పనులు చేసి అప్పుల పాలయ్యారని అన్నారు. ఇలాంటి పరిస్థితి కచ్చితంగా తెలుగుదేశం పార్టీలో ఉండదన్నారు.

గ్రామాల అభివృద్ధి తెలుగుదేశం పార్టీ ముఖ్య లక్ష్యమన్నారు. గతంలో రాప్తాడు నియోజకవర్గంలో అనేక గ్రామాలు అభివృద్ధి చెందిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం రాప్తాడు నియోజకవర్గంలో నీరు సంవృద్దిగా ఉన్న వినియోగించుకోలేని దుస్థితి ఏర్పడిందని ఆమె అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యే అవినీతి కారణంగా నియోజకవర్గానికి వచ్చిన పరిశ్రమలు సైతం వెనక్కి వెళ్లిపోయింది. ఎంతసేపు తమ స్వప్రయోజనాలు తప్ప ప్రజా ప్రయోజనాలు ప్రకాష్ రెడ్డికి పట్టడం లేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.చంద్రబాబు అధికారంలోకి వస్తేనే రైతులకు నిరుద్యోగులకు ఇతర వర్గాల వారికి న్యాయం జరుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. అందుకే సూపర్ సిక్స్ పథకాలను ఆయన తీసుకొచ్చారన్నారు. మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు పంపిణీ, ప్రతి నెల 1500 రూపాయల ఆర్థిక సాయం, అమ్మకు వందనం పేరుతో ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా అందరి చదువుల కోసం అమ్మకు వందనం, అలాగే నిరుద్యోగ భృతి, పరిశ్రమల స్థాపన, ప్రతిఏటా రైతులకు 15 వేల రూపాయల పెట్టుబడి సాయం వంటి పథకాలు ఉన్నాయని వివరించారు. తనపై ఎంతో నమ్మకం ఉంది రాప్తాడు టికెట్ మరోసారి కేటాయించినందుకు ఆమె చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. అందరం కష్టపడి రాప్తాడు నియోజకవర్గం లో భారీ మెజార్టీ సాధించి చంద్రబాబుకు కానుకగా ఇద్దామని ఆమె పిలుపునిచ్చారు.

Read More..

ఏపీలో కవిత క్రేజ్.. సెల్ఫీల కోసం ఎగబడ్డ జనం



Next Story

Most Viewed