Ap News: ఆ జిల్లాలో 4485 వేల పింఛన్లకు ఎసరు?

by Disha Web Desk 16 |
Ap News: ఆ జిల్లాలో 4485 వేల పింఛన్లకు ఎసరు?
X

అవ్వాతాతల ఉసురు తీస్తావా జగన్?

- టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండుమల తిప్పేస్వామి

దిశ, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర: మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్ మూర్తి ఆధ్వర్వంలో శ్రీసత్యసాయి జిల్లా మడకశిర 9, 20వ వార్డులతోపాటు బేగార్లపల్లిలో 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మాట్లాడుతూ అవ్వ తాతల పింఛన్లకు జగన్ పెట్టిన అడ్డగోలు నిబంధనలతో లక్షల పింఛన్లు ఎగిరిపోయాయన్నారు. ఇప్పుడు వాటికి అదనంగా రాష్ట్ర వ్యాప్తంగా మరో 1.60 లక్షల పింఛన్లు ఆగిపోతున్నాయని చెప్పారు. ఒక్క సత్యసాయి జిల్లాలో 4485 వేల పింఛన్లకు ఎసరు పెట్టారని మండిపడ్డారు. '1000 గజాలు ఇల్లు, కారు, 10 ఎకరాల పొలము,300 యూనిట్ల విద్యుత్తు వాడారంటూ వాలంటీర్లు ఇష్టారాజ్యంగా రాసుకున్న వివరాలే కొంపముంచాయన్నారు. ఒక్క అవకాశం అంటూ సీఎం జగన్ ప్రజల నెత్తిన కూర్చుని రాష్ట్రాన్ని అద: పాతాళంలోనికి నెట్టారని మండిపడ్డారు. పాలనలో రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్న కష్టనష్టాలకు లెక్కలేదని విమర్శించారు.


రాష్ట్ర అభివృద్ధి, రోడ్లు, పరిశ్రమలు, సేవారంగం, ఉద్యోగరంగం అట్టడుగు స్థాయిలో ఉన్నాయని తిప్పేస్వామి ఆరోపించారు. 'రైతులకు మేలు చేస్తానని వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడం. రైతుకు గిట్టుబాటు ధరలు కల్పించకపోవడం, వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు, డ్రిప్ ఇరిగేషన్, ఎరువులు ఇవ్వకపోవడం. పరిశ్రమలను తరిమికొట్టి నిరుద్యోగ సమస్య పెంచడం, ఉద్యోగులను బానిసలకంటే హీనంగా చూడడం.ఆర్టీసీ బస్ చార్జీలు, కరెంటు చార్జీలు పెంచడం, గ్యాస్‌పై ఉన్న సబ్సిడీ తొలగించడం, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి అభివృద్ధిని ఆమడ దూరం తరిమి రాష్ట్ర ప్రజలు ఇదేం ఖర్మ అనుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తున్నారు.' అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ అధ్యక్షుడు భక్తర్, పట్టణ అధ్యక్షుడు మనోహర్, కార్యదర్శి పుల్లయ్య చౌదరి, క్లస్టర్ ఇంచార్జ్ నాగరాజు, 9వ వార్డు కౌన్సిలర్ ఉమా శంకర్, 4వ వార్డు కౌన్సిలర్ హనుమంతు, మాజీ కౌన్సిలర్లు గోవిందప్ప, నాగరాజు, కృష్ణ నాయక్, జిల్లా నాయి బ్రాహ్మణ అధ్యక్షుడు రామాంజనేయులు, టీడీపీ యువ నాయకులు బి.రవికుమార్, బేగార్లపల్లి టీడీపీ నాయకులు మల్లేశ్, గోపాల్, నాగరాజు, సిన, కుమార్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ చంద్ర, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

1.Cm Jagan కు Pawan Kalyan బహిరంగ లేఖ

2.ఇది మాన‌వ‌త్వమేనా?... Cm Jaganకు నారా లోకేశ్ లేఖ


Next Story