ఏపీ రాజధాని ఫిక్స్.. మరోసారి తేల్చిచెప్పిన చంద్రబాబు

by Rajesh |
ఏపీ రాజధాని ఫిక్స్.. మరోసారి తేల్చిచెప్పిన చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ రాజధాని విషయంలో కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీలో చాలా సమస్యలు ఉన్నాయని.. రాష్ట్రం పూర్తిగా శిథిలమైందన్నారు. రైతులు అప్పుల పాలయ్యారని.. అన్ని వర్గాలు దెబ్బతిన్నాయన్నారు. ఏపీకి ఎంత అప్పు ఉందో తెలియదని.. అప్పులు ఎక్కడి నుంచి తెచ్చారో తెలియదన్నారు. ఏమేం తాకట్టు పెట్టారో తెలియని దుస్థితి ఉందన్నారు. ఇరిగేషన్ రంగాన్ని నిర్వీర్యం చేశారని.. పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానంతో ప్రతి ఎకరాకు నీరు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పదేళ్ల తర్వాత కూడా ఏపీ రాజధాని ఏది అంటే చెప్పుకోలేని దారుణ పరిస్థితి ఉందన్నారు. ఇకపై మూడు రాజధానులు అంటూ ఆటలాడే పరిస్థితి ఉండదన్నారు. అమరావతి రాజధానిగా ఉంటుందని కుండబద్ధలు కొట్టారు. విశాఖను ఆర్థిక, ఆధునిక రాజధానిగా తీర్చుదిద్దుకుందామన్నారు. కర్నూలును జ్యుడీషియల్ రాజధానిగా ప్రకటించి, ఏమీ చేయలేదన్నారు. కర్నూలును కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు.

Next Story

Most Viewed