సొంత గూటికి చేరనున్న ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి..నేడు జగన్ తో భేటీ

by Indraja |   ( Updated:2024-02-20 07:33:42.0  )
సొంత గూటికి చేరనున్న ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి..నేడు జగన్ తో భేటీ
X

దిశ డైనమిక్ బ్యూరో: ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. గోడ మీద పిల్లి ఎప్పుడు ఎటు వైపు దూకుతుందో తెలీదు అనేలా ఉంది వైసీపీ నేతల తీరు. వైసీపీలో చోటు చేసుకున్న మార్పులు చేర్పుల నేపథ్యంలో టికెట్ దక్కని నేతలు పార్టీకి గుడ్ బై చెప్పి మరో పార్టీ గూటికి చేరిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఇలా వైసీపీ నుండి జంప్ అయ్యి మరో పార్టీలో జాయిన్ అయిన వాళ్లలో మొదటి వ్యక్తి ఆళ్ళ రామకృష్ణారెడ్డి.

2019 లో జరిగిన ఎన్నికల్లో మంగళగిరి ఎమ్మెల్యేగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గెలుపొందారు. అయితే మంగళగిరి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్కేని పక్కన పెట్టిన అధిష్టానం.. రానున్న ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ అభ్యర్థిగా బీసీ వర్గానికి చెందిన గంజి చిరంజీవిని అధిష్టానం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆగ్రహానికి గురైన ఆళ్ళ రామకృష్ణా రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరారు. ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల నేతృత్వంలో పని చేసేందుకు ఆసక్తి చూపించారు.

అయితే వైసీపీని వీడిన ఆళ్ళ రామకృష్ణారెడ్డికి అనుకోని కష్టాలు చుట్టలుగా చుట్టుముట్టాయి. మంగళగిరి ఎమ్మెల్యేగా, అధికార పార్టీ నేతగా ఉన్న పలుకుబడి అంతా పోయింది. అలానే ప్రోటోకాల్ దగ్గరనుంచి అన్ని వదిలి పెట్టాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ క్రమంలో తనతో పాటుగా తనని గెలిపంచిన గెలిపించిన అనుచరులంతా ఆత్మరక్షణలో పడ్డారు. ఈ నేపథ్యంలో అయన అనుచరులు మళ్ళీ వైసీపీ పంచన చేరాల్సిందిగా ఆర్కే పై వత్తిడి తెచ్చారన్నది రాజకీయవర్గాల నుండి అందుతున్న సమాచారం.

ఇక అనుచరుల మాటను శిరసావహించి ఆర్కే రెండు రోజుల క్రితం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తో చర్చించారని తెలుస్తోంది. ఇక ఈ రోజు రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డి తో కలిసి సీఎం జగన్ ఆళ్ల రామకృష్ణారెడ్డితో భేటీ కానున్నారు. ఈ చర్చలు సఫలీకృతమైతే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆళ్ళ రామకృష్ణారెడ్డి వైసీపీ లో చేరే అవకాశం ఉంది. కాగా ఇప్పటికే మంగళగిరి ఇంచార్జ్ గా ప్రకటించిన బీసీ అభ్యర్థి గంజి చిరంజీవికి నియోజకవర్గంలో అంతగా ఆదరణ లేదని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో మంగళగిరి ఇంచార్జ్ ను మార్చే అవకాశం ఉందని.. ఈ క్రమంలో ఆళ్ళ రామకృషారెడ్డి వైసీపీలోకి వస్తే మంగళగిరి టికెట్ ను ఆర్కేకె ఇచ్చిన ఆశ్చర్యం లేదని సంబంధిత వర్గాల నుండి అందుతున్న సమాచారం.

Read More..

టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన

Advertisement

Next Story