Breaking: లింగమనేని నివాసం జప్తుపై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు.. ప్రతివాదులకు నోటీసులు

by Disha Web Desk 16 |
Breaking: లింగమనేని నివాసం జప్తుపై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు.. ప్రతివాదులకు నోటీసులు
X

దిశ, వెబ్ డెస్క్: లింగమనేని నివాసం జప్తుపై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. లింగమనేని నివాసం జప్తు చేసేందుకు అనుమతివ్వాలని కోరుతూ దాఖలు చేసిన సీఐడీ పిటిషన్‌ను అనుమతించింది. లింగమనేని రమేశ్ సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

కాగా టీడీపీ అధినేత చంద్రబాబు అద్దెకుంటున్న లింగమనేని రమేశ్ గెస్ట్ హౌస్ జప్తు చేసేందుకు అనుమతించాలని ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు సైతం జరిగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు గతంలో వాయిదా వేసింది. లింగమనేని గెస్ట్ హౌస్ జప్తుపై సీఐడీ వేసిన పిటిషన్‌ను తాజాగా ఏసీబీ కోర్టు అనుమతించింది.

కాగా గుంటూరు జిల్లా ఉండవల్లి కరకట్ట రోడ్డు సమీపంలోని లింగమనేని రమేశ్‌కు చెందిన ఇంట్లో కొన్నాళ్లుగా చంద్రబాబు అద్దెకు ఉంటున్నారు. అయితే రాజధాని అమరావతి బృహత్ ప్రణాళిక డిజైనింగ్, ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్ మెంట్, కంతేరు, కాజ, నంబూరు గ్రామాల ప్రాంతీయ ప్రణాళికల ద్వారా లంగమనేని ఆస్తులు, భూముల విలువ పెరగడానికి చంద్రబాబు దోహదపడ్డారని, తద్వారా వారికి అనుచిత లబ్ధి కలిగించారని సీఐడీ అభియోగం దాఖలు చేసింది. అలాగే లంచం, క్విడ్ ప్రోకో కింద చంద్రబాబుకు లింగమనేని తన ఇంటిని ఉచితంగా ఇచ్చారంటూ సీఐడీ అధికారులు ఆరోపించారు. అంతేకాదు లింగమనేని ఇంటిని జప్తు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని స్పష్టం చేశారు. ఈ మేరకు లింగమనేని ఇంటిని అటాచ్ చేసేందుకు అనుమతివ్వాలంటూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు ఏసీబీలో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.


Next Story

Most Viewed