రాజధాని పేరుతో కొత్త డ్రామా.. బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 5 |
రాజధాని పేరుతో కొత్త డ్రామా.. బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉమ్మడి రాజధాని పేరుతో కొత్త డ్రామాకు తెరలేపారని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ విమర్శించారు. మీడియా సమావేశంలో సత్యకుమార్ మాట్లాడుతూ.. మోసగించడం, నమ్మబలకడం, నయవంచనకు పాల్పడటం వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య అని దుయ్యబట్టారు. గతంలో కూడ ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని అని అసెంబ్లీ సాక్షిగా తీర్మానానికి మద్దతు తెలిపారని, అంతేగాక నేను అమరావతిలోనే ఇళ్లు కట్టుకున్నానని, మిగతా వాళ్లు కట్టలేదని నమ్మబలికించారు. సీఎం అవ్వగానే మూడు రాజధానులు అని వికృత చేష్టలకు వడిగట్టారని అన్నారు.

వైసీపీ నాయకుల ప్రధాన ఉద్దేశం దోచుకోవడం, దాచుకోవడమేనని, రాష్ట్రానికి రాజధాని ఉండాలి, రాష్ట్రం అభివృద్ది జరగాలి అని వారికి ఏ కోశాన లేదని విమర్శించారు. అమరావతి అభివృద్ది పనులకు కేంద్రం ఎంతో చేసిందని, రైళ్వే ప్రాజెక్టు ఇస్తే వద్దని వెనక్కి పంపించారని, మెట్రోకి ప్రతిపాధనలు పంపమని అడిగితే.. ఇంతవరకు ఆ ఊసే లేదని, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం భూమి సేకరించమని 1800 కోట్లు కేటాయిస్తే అది కూడా చేయలేదని తీవ్ర విమర్శలు చేశారు.

అంతేగాక 5 ఏళ్లలో రాజధాని నిర్మాణం చేపట్టకుండా.. విశాఖను పరిపాలన రాజధాని అని ప్రకటించి, అక్కడ విలాసవంతమైన ప్యాలెస్ కట్టుకున్నాడే తప్ప ఒక్క అభివృద్ది పని చేపట్టలేదని ఆరోపించారు. ఇవన్నీ పక్కన పెట్టి ఎన్నికల సమయంలో ఉమ్మడి రాజధాని అని చెప్పి కొత్త డ్రామాలకు తెర లేపుతున్నారని అన్నారు. మరోసారి ప్రజలను మోసం చేసేందుకే ఈ కుయుక్తులు పన్నుతున్నారని, ప్రజలు అన్ని గమనిస్తున్నారని వైసీపీకి బుద్ది చెప్పే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు.

Read More..

సీఎం జగన్‌కు బిగ్ షాక్.. టీడీపీలోకి వైసీపీ సిట్టింగ్ ఎంపీ


Next Story

Most Viewed