జగన్‌ను అలా ఎందుకన్నావ్... వైఎస్ షర్మిలపై బాబాయ్ ఆగ్రహం

by Disha Web Desk 16 |
జగన్‌ను అలా ఎందుకన్నావ్... వైఎస్ షర్మిలపై బాబాయ్ ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించారు. అలా బాధ్యతలు తీసుకున్నారో లేదో వెంటనే సీఎం జగన్‌ ప్రభుత్వంపై షర్మిల విరుచుకుపడ్డారు. ఏపీ విభజన సమస్యలు పరిష్కరించకపోవడానికి వైసీపీ, టీడీపీ కారణమంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు సీఎం జగన్ పరిపాలనపైనా షర్మిల సన్సేషనల్ కామెంట్స్ చేశారు.

దీంతో వైఎస్ షర్మిలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో రాజకీయాలు చేసుకోకుండా వైఎస్ షర్మిల ఏపీకి ఎందుకువచ్చిందంటూ ప్రశ్నించారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి ఆమె రాష్ట్రానాకి వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారు. ఏపీ జగన్ పాలన బాగుందని కాని షర్మిల చేసిన వ్యాఖ్యలు సరిగాలేవని ప్రభుత్వ సలహాదారు సజ్జల అన్నారు.


అయితే వైఎస్ షర్మిలపై ఆమె బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి సైతం విరుచుకుపడ్డారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణ నుంచి వచ్చి ఏపీలో అభివృద్ధి జరగలేదని చెప్పడానికి ఆమె ఎవరు అని ప్రశ్నించారు. తమతో వస్తే రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరగిందో చూపిస్తామని సవాల్ చేశారు. మొన్నటి వరకూ పక్క రాష్ట్రంలో రాజకీయాలు చేసి ఇప్పుడు ఏపీకి వచ్చి అభివృద్ది జరగలేదంటే ఎలా అని నిలదీశారు. షర్మిల కాదు.. ఎవరు వచ్చినా జగన్ ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేదని చెప్పారు. వైఎస్సార్‌ను కాంగ్రెస్ ఘోరంగా అవమానించిందని మండిపడ్డారు. వైఎస్ జగన్‌ను 16 నెలలు జైల్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. అలాంటి పార్టీ కోసమేనా షర్మిల మాట్లాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ ఆశయ సాధన కోసం పెట్టిన పార్టే వైసీపీ అని వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు.

Read More..

కేసీఆర్ ఓటమికి నేనే కారణం: YS షర్మిల సంచలన వ్యాఖ్యలు



Next Story

Most Viewed