Ys Viveka Murder Case: సీబీఐ కౌంటర్ దాఖలులో సంచలన విషయాలు

by Disha Web Desk 16 |
Ys Viveka Murder Case: సీబీఐ కౌంటర్ దాఖలులో సంచలన విషయాలు
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏ2 బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో సీబీఐ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. వజ్రాల పేరుతో సునీల్ విలువైన రాళ్లు విక్రయించేవారని, నకిలీ వజ్రాలతో వివేకానందారెడ్డిని మోసం చేసేందుకు ప్రయత్నించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే వజ్రాలు బూటకమని తెలుసుకుని సునీల్‌ను వివేకా హెచ్చరించినట్లు తెలిపారు. అప్పటి నుంచి వివేకపై సునీల్ యాదవ్ కోపం పెంచుకున్నారని వెల్లడించారు. గంగిరెడ్డితో కలిసి వివేకను హత్య చేయాలని ప్లాన్ చేసినట్లు అధికారులు పిటిషన్‌లో స్పష్టం చేశారు.

వివేకను హత్య చేస్తే రూ.40 కోట్ల డీల్ కుదరడంలో సునీల్ యాదవ్ కీలకంగా వ్యవహరించాడని సీబీఐ అధికారులు పిటిషన్‌లో పేర్కొన్నారు. వివేకా హత్య రోజు నిందితులంతా భాస్కర్ రెడ్డి ఇంట్లోనే ఉన్నట్లు తెలిపారు. అయితే వివేక హత్య గురించి వైఎస్ అవినాశ్ రెడ్డికి ముందే తెలుసని వెల్లడించారు. అయితే సాక్ష్యాలను చెరిపివేయడంలో అవినాశ్ రెడ్డి పాత్ర ఉందని సీబీఐ అధికారులు పిటిషన్‌లో పేర్కొన్నారు.

Also Read..

TTD: ఆర్జిత సేవా టికెట్ల కోసం భక్తుల తీవ్ర ఇబ్బందులు



Next Story