ఏపీలో మూడో సారి ఇంటింటి సర్వే

by  |
ఏపీలో మూడో సారి ఇంటింటి సర్వే
X

ఆంధ్రప్రదేశ్‌లో మూడోసారి ఇంటింటి సర్వేకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఏపీలోని ప్రతి ఇంటికి సంబంధించిన సమాచారం రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉంది. ఈ సమాచారం ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోంది. వలంటీర్ వ్యవస్థను అమలులోకి తెచ్చిన తరువాత మరింత కచ్చితమైన సమాచారం రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉంది. అయితే కరోనా నేపథ్యంలో ప్రతి ఇంటి ఆరోగ్య సమాచారం తెలుసుకోవాలని ప్రభుత్వం భావించింది. దీంతో మూడోసారి సర్వేకు ఆదేశాలు జారీ చేసింది.

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువా? అన్న చందంగా వలంటీర్లు మూడోసారి ఇళ్లు చుట్టేస్తున్నారు. కరోనా రాష్ట్రంలో ప్రవేశించిందని తెలియగానే సరిహద్దులను మూసేసిన రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరించేందుకు ఒకసారి సర్వే చేయించింది. అనంతరం రేషన్ సరఫరాతో పాటు, ఇంటింట ఆరోగ్యం కోసం మరోసారి సర్వే చేయించింది. ఊహించని విధంగా కరోనా కేసులు నమోదు కావడంతో మూడో సారి సర్వేకు సిద్ధమైంది.

దీంతో రాష్ట్రంలోని 1,42,13,460 కుటుంబాల ఆరోగ్య పరిస్థితిపై సర్వే చేయాలని వలంటీర్లను ఆదేశించింది. జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరం లక్షణాలతో బాధపడుతున్నట్టు గుర్తించిన 11,821 మందిపై ప్రధానంగా దృష్టిపెట్టాలని సూచించింది. వీరిలో వైద్యుల సూచనల మేరకు 2,045 మందికి పరీక్షలు నిర్వహించాలని సూచించింది. అలాగే వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించడంలో ఇబ్బందులుంటే 1902కి ఫోన్ చేయాలని సూచించింది.

రాష్ట్రంలో 6,662 బెడ్లతో పాటు 334 ఐసీయూ బెడ్లు సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. అదనంగా బెడ్లను సిద్ధం చేయిస్తున్నట్టు భరోసా ఇచ్చింది. ఢిల్లీ నుంచి వచ్చిన వారితో కాంటాక్ట్‌లో ఉన్న 1750 మందిని క్వారంటైన్‌లో ఉంచి, నిఘా ఉంచింది. మరోవైపు తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని కూడా క్వారంటైన్‌లో ఉంచింది. వీరిని కూడా ఓ కంటకనిపెడుతోంది. ఈ సర్వేలో 1.36 కోట్ల కుటుంబాలకు రేషన్ అందిందా లేదా?, 1.22 కోట్ల కుటుంబాలకు 1000 రూపాయలు అందిందా లేదా? సరిచూడనుంది.

Tags: 3rd survey, andhra pradesh, government, volunteers,

Next Story

Most Viewed