గిజిగాని గూడు.. తాతకు మాస్క్ గా మారింది చూడు

by  |
గిజిగాని గూడు.. తాతకు మాస్క్ గా మారింది చూడు
X

దిశ, మహబూబ్ నగర్: కరోనా రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తుంది. ప్రజలు సైతం కరోనా పై అవగాహనా పెంచుతూ తమ వంతు బాధ్యత నిర్వర్తిస్తున్నారు. మాస్క్ పెట్టుకోకుండా బయట కనిపిస్తే పోలీసులు ఫైన్ లు కట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముక్కుకు అడ్డుగా ఉండాలి.. అది ఏదైతే ఏం అనుకున్నాడో ఏమో ఒక తాత.. ఏకంగా పక్షి గూడునే మాస్క్ గా మార్చేశాడు. చెట్ల కొమ్మలకు గిజిగాడు ( ఊరుపిచ్చుక లాంటి చిన్న పక్షి) కట్టుకునే గూడును ఒకప్పుడు పిల్లలు టోపీలు గా పెట్టుకొని ఆడుకునేవారు. కానీ ఇప్పుడు ఆ గూడు ఓ పెద్దాయనకు మాస్క్ గా మారింది.

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అడ్డాకుల మండలం చిన మును గాల్ చేడ్ గ్రామానికి చెందిన మేకల కుర్మయ్య గిజిగాడి గూడు ను మాస్కు ధరించి అందరి దృష్టిలో పడ్డాడు. బుధవారం గిజిగాడి గూడును మాస్కు గా ధరించి అడ్డాకుల మండల కేంద్రానికి వచ్చాడు. అందరూ సాధారణ మాస్కులు ధరించి వస్తే, కురుమయ్య మాత్రం విభిన్నంగా గూడును మాస్క్ గా ధరించి రావడంతో అందరు అతని వైపు ఆశ్చర్యంగా చూస్తుండగా మరి కొందరు ఈ దృశ్యాన్ని తమ సెల్ ఫోన్లలో బంధించారు. సామాజిక మాధ్యమాలలో ఈ దృశ్యం చక్కర్లు కొడుతుంది.

Next Story

Most Viewed