మూత్రానికి..పూలకుండీలట మీకు తెలుసా?

by  |
మూత్రానికి..పూలకుండీలట మీకు తెలుసా?
X

‘‘ఇచ్చట మూత్రం పోయరాదు’’ అనే గోడల మీది రాతలు కేవలం భారతదేశంలోనే ఉంటాయనుకుంటే పొరపాటే. పాశ్చాత్య దేశాల్లో కూడా ఇలాంటి రాతలు ఉంటాయి. కాకపోతే ఇండియాలో పోసేది ఇండియన్లే అయ్యుంటారు. కానీ, పాశ్చాత్య దేశాల్లో పోసేది అక్కడికి పర్యాటనకు వచ్చిన సందర్శకులు. అందుకే ఆమ్‌స్టర్‌డామ్ ఇలా పర్యాటకులు రోడ్ల మీద మూత్రం పోయడాన్ని తగ్గించడానికి ఒక కొత్త రకం పూల కుండీలను పెట్టారు. ఇప్పుడు ఈ పూల కుండీల ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అక్కడి రెడ్ లైట్ డిస్ట్రిక్ట్, లీడ్సెప్లీన్, రెంబ్రాండ్‌ప్లీన్ పర్యాటక ప్రదేశాల్లో ఈ యూరిన్ పూల కుండీలను ఏర్పాటు చేశారు. ఈ పూల కుండీల ద్వారా సందర్శకులు రోడ్ల మీద, వీధుల్లో మూత్రం పోయకుండా నిరోధించడమే కాకుండా, అలా సేకరించిన మూత్రాన్ని ఫెర్టిలైజర్‌గా కూడా ఉపయోగించనున్నారు. ఈ పూలకుండీలకు గ్రీన్‌పీ అని పేరు కూడా పెట్టారు. ఇప్పటివరకు ప్రయోగాత్మకంగా 12 గ్రీన్‌పీలను ఇన్‌స్టాల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ గ్రీన్‌పీల నుంచి రోజూ సాయంత్రం మూత్రాన్ని సేకరించి పాస్ఫేట్ హార్వెస్టింగ్ చేస్తారని వీటిని కనిపెట్టిన రిచర్డ్ దె వ్రీస్ తెలిపారు. ఇదే మూత్రంతో చిన్న మొత్తాల్లో విద్యుత్ కూడా ఉత్పత్తి చేసే అవకాశం ఉందని రిచర్డ్ అంటున్నారు. ప్రయోగాత్మకంగా చేసిన ప్రయత్నం వల్ల టూరిస్టులు వీధుల్లో మూత్రం పోయడం 49 శాతం తగ్గడంతో మరో 50వేల యూరోలు (రూ. 44,67,400) వీటికోసం పెట్టుబడి పెట్టేందుకు ఆమ్‌స్టర్‌డామ్ కౌన్సిల్ సిద్ధపడినట్లు సమాచారం.



Next Story

Most Viewed