జేఏసీ నుంచి ఈయూ ఔట్

         తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నుంచి ఎంప్లాయీస్ యూనియన్ వైదొలిగింది. కార్మికుల సమస్యలపై స్పందించకుండా ఉండటం అర్థరహితమని, అందుకే జేఏసీ నుంచి బయటకు వచ్చేశామని ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. రెండేండ్ల వరకు యూనియన్ల వెరిఫికేషన్ లేదని ప్రభుత్వం చెబుతున్నా, జేఏసీగా ఎలాంటి నిరసన తెలియజేయలేకపోయామని టీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కే రాజిరెడ్డి పేర్కొన్నారు. ట్రేడ్ యూనియన్ చట్టాల పరిధిలో ఎంప్లాయీస్ యూనియన్ రిజిష్టర్ అయిందని, కాబట్టి కార్మికుల […]

Update: 2020-02-06 08:49 GMT

తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నుంచి ఎంప్లాయీస్ యూనియన్ వైదొలిగింది. కార్మికుల సమస్యలపై స్పందించకుండా ఉండటం అర్థరహితమని, అందుకే జేఏసీ నుంచి బయటకు వచ్చేశామని ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. రెండేండ్ల వరకు యూనియన్ల వెరిఫికేషన్ లేదని ప్రభుత్వం చెబుతున్నా, జేఏసీగా ఎలాంటి నిరసన తెలియజేయలేకపోయామని టీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కే రాజిరెడ్డి పేర్కొన్నారు. ట్రేడ్ యూనియన్ చట్టాల పరిధిలో ఎంప్లాయీస్ యూనియన్ రిజిష్టర్ అయిందని, కాబట్టి కార్మికుల సమస్యలపై స్పందించే హక్కు తమకు ఉందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని యూనియన్ నాయకుల ప్రాతినిధ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, లేకపోతే న్యాయ పోరాటానికి సిద్ధమని హెచ్చరించారు.

Tags:    

Similar News