దక్షిణ కాశీ భగవానుడికి ప్రణామాలు.. తెలుగులో స్పీచ్ స్టార్ట్ చేసిన మోడీ

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ తెలంగాణలో పర్యటిస్తున్నారు.

Update: 2024-05-08 05:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. తొలుతో వేములవాడ రాజన్న ఆలయాన్ని దర్శించుకున్న ప్రధాని.. అనంతరం కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కు మద్దతుగా వేములవాడలో నిర్వహిస్తు్న్న బహిరంగ సభలో మాట్లాడారు. దక్షిణ కాశీ భగవానుడు రాజరాజేశ్వరస్వామికి ప్రణామాలు అంటూ మోడీ తెలుగులో ప్రసంగాన్ని స్టార్ట్ చేశారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదం కోసమే ఇక్కడికి వచ్చానని తెలిపారు. ఇప్పటివరకు మూడు విడతల్లో ఎన్నికలు పూర్తయ్యాయని.. మూడు విడతల్లో జరిగిన ఎన్నికల్లో ఇండియా కూటమికి పరాభవమే అన్నారు. మిగిలిన 4 విడతల్లోనూ బీజేపీ, ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు సన్నద్ధమయ్యారన్నారు. కరీంనగర్‌లో బండి సంజయ్ విజయం ముందే నిర్ణయమైందని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్‌లో ఎవరికీ తెలియని అభ్యర్థిని కాంగ్రెస్ బరిలోకి దింపింది. కాంగ్రెస్ పార్టీ ఓటమి కరీంనగర్‌లో ఖాయమైందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభావం కరీంనగర్ లో మచ్చుకైనా కనిపించట్లేదన్నారు. మీ ఓటు వల్లే ప్రపంచంలో ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని తీర్చదిద్దా అన్నారు. కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాలుల దెబ్బతిన్నాయన్నారు.  

Similar News