మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ 

దిశ, ఏపీ బ్యూరో: మహిళల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని ఏపీ సీఎం వైఎస్‌ జగన్ స్పష్టం చేశారు. ‘వైఎస్సార్‌ ఆసరా’ పథకాన్ని శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… ఎన్నికల నాటికి ఉన్న రుణాలన్నీ చెల్లిస్తామని హామీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఈ పథకాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు. 87 లక్షల మంది మహిళలకు రూ.27 వేల కోట్ల రుణాలున్నాయని, నాలుగు విడతల్లో ‘వైఎస్సార్‌ ఆసరా’ ద్వారా చెల్లిస్తున్నామని తెలిపారు. తొలివిడతలో […]

Update: 2020-09-11 03:29 GMT

దిశ, ఏపీ బ్యూరో: మహిళల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని ఏపీ సీఎం వైఎస్‌ జగన్ స్పష్టం చేశారు. ‘వైఎస్సార్‌ ఆసరా’ పథకాన్ని శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… ఎన్నికల నాటికి ఉన్న రుణాలన్నీ చెల్లిస్తామని హామీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఈ పథకాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు.

87 లక్షల మంది మహిళలకు రూ.27 వేల కోట్ల రుణాలున్నాయని, నాలుగు విడతల్లో ‘వైఎస్సార్‌ ఆసరా’ ద్వారా చెల్లిస్తున్నామని తెలిపారు. తొలివిడతలో రూ.6,792.20 కోట్లు జమ చేస్తున్నామని చెప్పారు. ‘‘పీఅండ్‌జీ (P&G), హెచ్‌యూఎల్ (HUL)‌ లాంటి మల్టీనేషనల్‌ కంపెనీల ద్వారా మహిళలకు చేయూతనిస్తామన్నారు.

30 లక్షల ఇళ్ల పట్టాలు సిద్ధం..

30 లక్షల మంది అక్కాచెల్లెమ్మలకు ఇళ్లపట్టాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం వైఎస్‌ జగన్‌ వెల్లడించారు. కొంతమంది కావాలనే ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారని, త్వరలోనే పట్టాలు పంపిణీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

Read Also..

అదే లేకుంటే ఎప్పుడో ముందుకెళ్లేవాళ్లం : పవన్

Full View

Tags:    

Similar News