POLYCET 2024: ప్రశాంతంగా ముగిసిన పాలిసెట్.. ఫలితాలు ఆ తేదీనే విడుదల!

పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల ప్రవేశాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఏపీ పాలిసెట్–2024 ప్రవేశ పరీక్ష శనివారం ప్రశాంతంగా ముగిసింది.

Update: 2024-04-28 03:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల ప్రవేశాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఏపీ పాలిసెట్–2024 ప్రవేశ పరీక్ష శనివారం ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,41,978 (88.74 శాతం) మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. మొత్తం పరీక్షకు 1,59,989 మంది దరఖాస్తు చేసుకోగా.. 1,41,978 మంది పరీక్ష రాశారని ఓ ప్రకటనలో సాంకేతిక విద్యా శాఖ కమిషనర్‌ చదలవాడ నాగరాణి వెల్లడించారు. ఇక పాలిసెట్ ప్రాథమిక ‘కీ’ని ఏప్రిల్ 30న విడుదల చేస్తామని తెలిపారు. ఫలితాలను మే 10లోపు విడుదల చేస్తామని పేర్కొన్నారు. జూన్ మొదటి వారంలో విద్యా సంవత్సరాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 442 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 11 గంటల నుంచి మద్యాహ్నం ఒంటి గంట వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించారు. 

Tags:    

Similar News