రైతు పండించిన పంటకు మద్దతు ధర కల్పిస్తాం : వైయస్ షర్మిల

దిశ, మునుగోడు: ఆరుగాలం కష్టించి పండించిన వరి పంటను అమ్ముకోలేక గోస పడుతున్న రైతన్న గోస తీర్చలేని సీఎం కేసీఆర్ గద్దె దిగాలని తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఆమె చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర 20వ రోజు సోమవారం మండలంలోని జక్కలవారిగూడెం, కచిలాపురం, గ్రామాల మీదుగా పర్యటించి రత్తుపల్లి గ్రామానికి చేరుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన మాట ముచ్చట కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రెండుసార్లు కేసీఆర్‌కు అవకాశం ఇస్తే మోసపూరిత […]

Update: 2021-11-08 10:45 GMT

దిశ, మునుగోడు: ఆరుగాలం కష్టించి పండించిన వరి పంటను అమ్ముకోలేక గోస పడుతున్న రైతన్న గోస తీర్చలేని సీఎం కేసీఆర్ గద్దె దిగాలని తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఆమె చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర 20వ రోజు సోమవారం మండలంలోని జక్కలవారిగూడెం, కచిలాపురం, గ్రామాల మీదుగా పర్యటించి రత్తుపల్లి గ్రామానికి చేరుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన మాట ముచ్చట కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రెండుసార్లు కేసీఆర్‌కు అవకాశం ఇస్తే మోసపూరిత హామీలతో నీళ్లు, నిధులు, నియామకాలు తన ఫాంహౌజ్‌కు మళ్ళించుకున్నాడని ఎద్దేవా చేశారు. గాడిదకు రంగు పూసి ఇది ఆవు అని నమ్మించ గల మోసగాడు కేసీఆర్ అని అన్నారు.

సంక్షేమం, సమానత్వం సమగ్ర అభివృద్ధి కోసమే వైయస్సార్ తెలంగాణ పార్టీ పెట్టామన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు బుద్ధి చెప్పి వైయస్ఆర్ తెలంగాణ పార్టీకి పట్టం కడితే అధికారంలోకి రాగానే మొదటి సంతకం నోటిఫికేషన్ల పై పెడుతామన్నారు. ఇటీవల కరోనా బారిన పడ్డ ప్రజలు ఆ బిల్లులు దాచుకోవాలని తాము అధికారంలోకి రాగానే ఆ బిల్లులు ప్రతి ఒక్కరికి చెల్లిస్తామన్నారు. రైతు పండించిన పంటకు మద్దతు ధర కల్పిస్తామన్నారు.

Tags:    

Similar News