ఎటు చూసినా మృతదేహాలే.. భూకంపం ధాటికి 3,800 మంది మృతి

సోమవారం టర్కీ, సిరియాలో సంభవించిన భారీ భూకంపం ఆ దేశాలను అతలాకుతలం చేసింది. వందల సంఖ్యలో భారీ భవనాలు నేల కూలడంతో అందులో ఉన్న వారంతా.. శిథిలాల కింద చిక్కుకున్న పోయారు.

Update: 2023-02-07 02:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: సోమవారం టర్కీ, సిరియాలో సంభవించిన భారీ భూకంపం ఆ దేశాలను అతలాకుతలం చేసింది. వందల సంఖ్యలో భారీ భవనాలు నేల కూలడంతో అందులో ఉన్న వారంతా.. శిథిలాల కింద చిక్కుకున్న పోయారు. సోమవారం తెల్లవారు జామున 4.30 నిమిషాల ప్రాంతంలో 7.9 తీవ్రతతో భూకంపం సంభవించగా.. నిద్రమత్తులో ఉన్న ప్రజలు ప్రాణాలు వదిలారు.

మొత్తం ఈ ప్రమాదంలో 3,800 మందికి పైగా మృతి చెందారు. అలాగే.. 18,000 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. దీంతో పాటు భారీ భవనాల శిథిలాల కింద వేల సంఖ్యలో చిక్కుకుని పోయారు. ఈ భూకంప ప్రమాదంలో మృతుల సంఖ్య 20,000 దాటే అవకాశం ఉన్నట్లు WHO ప్రకటించింది. ఈ భూకంపంలో సిరియాలో ఓ ప్రభుత్వ భవనం కూలిపోవడంతో అధికారులు 1,444 మంది మరణించారు.

Similar News