Kim Jong Un: తగ్గేదేలే అంటున్న కిమ్.. ఆందోళనలో అగ్రదేశాలు.. కారణం ఇదే..?

ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత అనే రీతిలో నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ ప్రవర్తన ఉంటుంది.

Update: 2024-05-04 06:30 GMT

దిశ వెబ్ డెస్క్: ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత అనే రీతిలో నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ ప్రవర్తన ఉంటుంది. దేశ ప్రజలు ఆకలితో అల్లాడుతుంటే.. కిమ్ మాత్రం పొరుగు దేశాలతో యుద్ధానికి కాలుదువ్వుతూ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంటాడు. పేలని బాంబుకు ఒత్తి పొడుగు అనే రీతిలో, నా దగ్గర బలమైన సైన్యం ఉందని, అధునాతన ఆయుధాలు, అణ్వాయుధాలు ఉన్నాయని కిమ్ ప్రగల్భాలు పలుకుతూ, తన దేశం అన్ని దేశాలకంటే గొప్పగా ఉందని చెప్తూ.. అబద్ధాన్ని నిజమని నమ్మించడానికి ప్రయత్నిస్తుంటారు.

ఇక నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్‌కు మానవత్వం లేదని, మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు తానని ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. మనిషి ప్రాణానికి విలువివ్వని కిమ్ ఎంతకైనా తెగిస్తారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దీంతో పాశ్చాత్య దేశాలు నార్త్ కొరియాకు కొంచెం దూరంగానే ఉంటాయి. అయితే ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి రష్యా, చైనా, ఉత్తర కొరియా, ఇరాన్‌‌లు మద్య సన్నిహిత సంబంధాలు బలపడ్డాయి.

అధునాతన ఆయుధాల తయారీలో ముందుండే రష్యా, ఆధిపత్యం కోసం ప్రపంచాన్ని సైతం నాశనం చేయడానికి వెనకాడని చైనా, మానవత్వానికి మీనింగ్ కూడా తెలియని కిమ్ ఒకటి కావడంతో యుఎస్, దక్షిణ కొరియా ఆందోళన చెందుతున్నాయి. ఇటీవలే ఉత్తర కొరియా ఇరాన్‌కు ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని పంపింది. ఈ నేపథ్యంలో ఇరాన్, ఉత్తర కొరియా మధ్య సంభావ్య సైనిక సహకారంపై యుఎస్ మరియు దక్షిణ కొరియా అధికారులు ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు.

కాగా ఇరాన్‌కు వెళ్ళిన ఉత్తర కొరియా బృందం గురువారం ప్యోంగ్యాంగ్‌కు తిరిగివచ్చింది. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి, ఉత్తర కొరియా బృందం కేవలం వాణిజ్య ప్రదర్శనలో పాల్గొని అధికారులతో సమావేశమైందని తెలిపారు. కాగా ద్వైపాక్షిక సైనిక సహకారంపై వస్తున్న ఆరోపనలు కేవలం ఊహాగానాలు మాత్రమేనని, అలానే నిరాధారమైనవి అని కొట్టిపారేశారు.

Similar News