కీలక ప్రకటన చేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. పాశ్చాత్య దేశాలు అణు బ్లాక్ మెయిల్ ను కొనసాగిస్తే, మాస్కో తన విస్తారమైన ఆయుధాల శక్తితో ప్రతిస్పందిస్తుందని హెచ్చరించారు.

Update: 2022-09-21 10:03 GMT

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. పాశ్చాత్య దేశాలు అణు బ్లాక్ మెయిల్ ను కొనసాగిస్తే, మాస్కో తన విస్తారమైన ఆయుధాల శక్తితో ప్రతిస్పందిస్తుందని హెచ్చరించారు. బుధవారం ఆయన టెలివిజన్ ద్వారా జాతినుద్దేశించి మాట్లాడారు. రష్యా, దాని భూభాగాలను రక్షించడానికి 2 మిలియన్ల బలమైన సైనిక నిల్వలను పాక్షికంగా సమీకరిస్తున్నామని అన్నారు.

పశ్చిమ దేశాలు రష్యాను నాశనం చేయాలని కోరుకుంటున్నాయని, ఉక్రెయిన్‌లో శాంతిని కోరుకోవడం లేదని పేర్కొన్నారు. తమ దేశ ప్రాంతీయ సమగ్రతను నాశనం చేయాలని చూస్తే, మా ప్రజలను రక్షించడానికి అన్ని విధాలుగా ముందుకు వెళుతాం. ఇది మోసం కాదు' అని అన్నారు. ధీటుగా స్పందించడానికి రష్యా వద్ద అనేక ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు. తూర్పు ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్ ఇండస్ట్రియల్ హార్ట్‌ల్యాండ్ ప్రాంతాన్ని విముక్తి చేయడమే తన లక్ష్యమని పుతిన్ పునరుద్ఘాటించారు.

ఈ ప్రాంతంలోని చాలా మంది ప్రజలు ఉక్రెయిన్‌కు తిరిగి రావడానికి ఇష్టపడలేదు. ఇప్పటికే రష్యా లుహన్స్క్, డొనెట్స్క్ ప్రాంతాలను తమ అధీనంలో ఉన్నట్లుగా పరిగణిస్తుంది. అయితే రష్యా అక్రమంగా వీటిని అక్రమించిందని ఉక్రెయిన్ పాశ్చాత్య దేశాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే 60శాతాం డొనెట్స్క్ ప్రాంతాన్ని, పూర్తి లుహన్స్క్ ప్రాంతాలపై రష్యా అధీనంలో ఉన్నాయి. పుతిన్ ప్రకటనపై బ్రిటన్ విదేశాంగ మంత్రి గిలియన్ కేగాన్ తీవ్రంగా స్పందించారు.

రష్యా అధ్యక్షుడి ప్రసంగం ఆందోళనకరంగానూ, బెదిరింపులకు గురి చేసేలా ఉందని అన్నారు. పుతిన్ మాటలతో పశ్చిమ దేశాలను భయపెట్టాలని చూశాలని పేర్కొన్నారు. కాగా, ఇప్పటికే జైళ్లలో ఉన్న ఖైదీలను సైన్యంలో చేరితే క్షమాభిక్ష ప్రసాదిస్తాననే హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మంగళవారం రాత్రి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మాట్లాడుతూ లుహన్స్క్, ఖెర్సాన్, జపొరిజ్జియా, డొనెట్స్క్ ప్రాంతాల్లో రాబోయే కాలంలో ఓట్లపై అనక ప్రశ్నలు ఉన్నాయని అన్నారు. రష్యా దళాల ఆధీనంలో ఉన్న ఉక్రెయిన్ కట్టుబడి ఉందని నొక్కి చెప్పారు. ప్రస్తుత పరిస్థితులు ఉక్రెయిన్‌కు సానుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు.

Similar News