17 మంది రోగులను చంపిన నర్సుకు 700 ఏళ్ల జైలు శిక్ష

పేషెంట్లకు అధిక మోతాదులో ఇన్సూలిన్ ఇచ్చి 17 మంది రోగుల చావుకు కారణమైన ఒక నర్సు‌కు అమెరికాలో ఒక కోర్టు 700 సంవత్సరాలకు పైగా జైలు విధించింది.

Update: 2024-05-04 08:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పేషెంట్లకు అధిక మోతాదులో ఇన్సూలిన్ ఇచ్చి 17 మంది రోగుల చావుకు కారణమైన ఒక నర్సు‌కు అమెరికాలో ఒక కోర్టు 700 సంవత్సరాలకు పైగా జైలు విధించింది. పూర్తి వివరాల్లోకి వెలితే, అమెరికాలోని పెన్సిల్వేనియాకు చెందిన 41 ఏళ్ల నర్సు అయిన హీథర్ ప్రెస్‌డీ తాను పనిచేసిన ఆసుపత్రిలో రోగులకు మోతాదుకు మించి ఇన్సులిన్ ఇచ్చేది. అలా మొత్తం ప్రెస్‌డీ 22 మంది రోగులకు అధిక మొత్తంలో ఇన్సులిన్ ఇవ్వగా 17 మంది చనిపోయారు. 2020 నుంచి 2023 మధ్య ఐదు ఆరోగ్య కేంద్రాలలో రోగులకు ప్రెస్‌డీ ఇన్సులిన్ ఇంజెక్ట్ చేసింది. మూడు హత్యలు, 19 హత్యాయత్నాలు చేసినట్టుగా ఆమె అంగీకరించడంతో కోర్టు ఈ శిక్షను విధించింది.

గత ఏడాది మేలో ఇద్దరు రోగులను చంపినందుకు ఆమెపై తొలుత అభియోగాలు మోపారు, ఆ తర్వాత విచారణలో ఆమె చేసిన ఇతర నేరాలు సైతం వెలుగులోకి వచ్చాయి. ఆమె బారిన పడిన వారిలో 43 నుంచి 104 సంవత్సరాల వయస్సు గల వారు ఎక్కువగా ఉన్నారు. ఇన్సులిన్ అధిక మోతాదు ఇవ్వడం ద్వారా హైపోగ్లైసీమియాకు దారితీస్తుంది, హృదయ స్పందనను పెంచడంతో గుండెపోటు కూడా వస్తుంది. సహోద్యోగులు ఆమె ప్రవర్తన కూడా సరిగ్గా ఉండదని తెలిపారు, ఆమె తన రోగుల పట్ల ద్వేషంగా మాట్లాడేదని, రోగులపై తరచుగా అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తుందని చెప్పారు. ఆమె తల్లికి పంపించిన మెసేజ్‌లలో కూడా తన చుట్టూ ఉన్నవారు, రోగులు నచ్చడం లేదని చెప్తుండేదని సహోద్యోగులు అన్నారు. అయితే ఆమెకు ఎలాంటి జబ్బు లేదని, మానసిక స్థితి బాగానే ఉందని బాధితురాలి కుటుంబ సభ్యుల్లో ఒకరు కోర్టుకు తెలిపారు.

Similar News