ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్ 'FLiRT' కొత్త వేరియంట్... భారత్ కి కూడా ముప్పు ఉందా ?

కరోనా వైరస్ మొదటి వేవ్, రెండో వేవ్ లో ప్రపంచాన్నే వణికించి పోయింది.

Update: 2024-05-06 08:35 GMT

దిశ, ఫీచర్స్ : కరోనా వైరస్ మొదటి వేవ్, రెండో వేవ్ లో ప్రపంచాన్నే వణికించి పోయింది. అలాగే ఇప్పుడు మరోసారి సరికొత్త రూపం దాల్చిన కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికించనుంది. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కేసులు ఒక్కొక్కటిగా పెరగడం మొదలైంది. గత రెండు వారాలుగా అమెరికాలో కోవిడ్ FLIRT కేసులు పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని కేసులు పెరుగుతాయని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అమెరికా CDC ప్రకారం ఈ వేరియంట్‌ను WHO పర్యవేక్షించాలని సూచించింది. అమెరికన్ శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం ఈ వైరస్ శరవేగంగా వ్యాపించనుంది. ఇప్పటికే ఈ వేరియంట్ కోవిడ్ కేసులలో 7 శాతంగా నమోదవ్వగా రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు నిపుణులు. ప్రస్తుతం ప్రపంచాలన్ని వణికిస్తున్న ఈ వేరియంట్ భారత్ లో కూడా విజృంభించనుందా.. నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

FLIRT వేరియంట్..

కరోనా వైరస్ లాంటి వైరస్ లు ఎప్పుడూ ఉంటాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ వైరస్ ల ప్రభావం కొద్దికొద్దిగా తగ్గడం ప్రారంభం అయ్యింది. గత రెండేళ్ళలో కోవిడ్ సరళిని మనం పరిశీలిస్తే, కరోనా ప్రమాదం నిరంతరం తగ్గుతోంది. ఇప్పుడు ఈ వైరస్ సాధారణ దగ్గు, జలుబులా మారింది. వైరస్ లక్షణాలు కూడా చాలా తేలికపాటివిగా ఉన్నాయి. అయినప్పటికీ వైరస్ తనను తాను సజీవంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుంది.

ఈ క్రమంలో తనని తాను మార్చుకుంటూ వైరస్ కొత్తగా రూపాంతరం చెందుతుంది. దీని కారణంగా కొత్త వేరియంట్‌లు మారుతూనే ఉన్నాయి. ప్రతిఏడాది కొత్త వేరియంట్‌లు ఉద్భవించటానికి కారణం ఇదే. ఈ క్రమంలో కొత్త వేరియంట్ FLIRT వచ్చింది. ఇది ఓమిక్రాన్ కి సంబంధించిన ఉపరూపాంతరం. అంటే ఇది కొత్త వేరియంట్ కాదంటున్నారు నిపుణులు.

కొత్త వేరియంట్ నుండి ముప్పు ఉందా ?

ఓమిక్రాన్ వేరియంట్ గత ఏడాది కంటే ఎక్కువ కాలం ప్రపంచవ్యాప్తంగా ఉందని వైద్యనిపుణులు చెప్పారు. దీని కొత్త వేరియంట్‌లు కూడా వస్తూనే ఉన్నాయి. అయితే ఇది ప్రమాదకరం కాదు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కేసులేవీ Omicron ఉప-వేరియంట్ నుండి కనిపించలేదు. FLIRT వేరియంట్ నుండి ఎటువంటి తీవ్రమైన ప్రమాదం సంభవించే అవకాశం లేదు. అయితే జాగ్రత్తలు మాత్రం పాటించాలంటున్నారు నిపుణులు.

ప్రస్తుతానికి భారతదేశంలో వస్తున్న కోవిడ్ కేసులలో కొత్త వేరియంట్ ఉందా అనేది పరిశీలించాలి. ఇందుకోసం జీనోమ్ సీక్వెన్సింగ్‌ను పెంచాల్సి ఉంటుంది. వ్యాధి సోకిన వారి నమూనాలను పరీక్షించవలసి ఉంటుంది. ఒకవేళ రోగులలో కొత్త రూపాంతరం కనుగొంటే వారు వారిని వేరుచేసి, లక్షణాల పై నిఘా ఉంచాలి.

లక్షణాలు..

కండరాల నొప్పి

శరీర నొప్పి

తలనొప్పి

జ్వరం

జలుబు

గొంతు నొప్పి

ఎలా రక్షించుకోవాలి..

కోవిడ్ వైరస్ అంతరించిపోలేదని అంటువ్యాధి నిపుణులు చెబుతున్నారు. దీని వేరియంట్లు భవిష్యత్తులో కూడా వస్తూనే ఉంటాయంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఇలా ఆలోచించి భయపడాల్సిన పనిలేదంటున్నారు. ప్రధాన విషయం ఏమిటంటే నివారణ పై దృష్టి పెట్టండి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. చేతులు కడుక్కున్న తర్వాత ఆహారం తీసుకోండి. ఫ్లూ లక్షణాలు ఉన్న వ్యక్తుల నుండి దూరం ఉండండి. జ్వరం, దగ్గు, జలుబు వంటి ఏవైనా సమస్యలుంటే ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోండి.

Tags:    

Similar News