Miss Universe: అందాల పోటీల్లో సంచలనం.. కుర్రకారును ఉర్రూతలూగిస్తూ మిస్ యూనివర్స్‌గా ఎంపికైన 60 ఏళ్ల మహిళ

మిస్ యూనివర్స్ అవ్వాలంటే 16 ఏళ్ల వయసే ఉండక్కర్లేదని ఓ మహిళ నిరూపించింది.

Update: 2024-04-26 14:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: మిస్ యూనివర్స్ అవ్వాలంటే 16 ఏళ్ల వయసే ఉండక్కర్లేదని ఓ మహిళ నిరూపించింది. తాజాగా, బ్యూనస్ ఎయిర్స్‌లో జరిగిన అందాల పోటీల్లో ‘లా ప్లాటా’ ప్రాంతానికి చెందిన 60 అలెజాండ్రా మారిసా రోడ్రిగ్జ్ ఏకంగా మిస్ యూనివర్స్ కీరిటాన్ని సొంతం చేసుకుంది. అనేళ్లు వచ్చినా.. ఎక్కడ తన వయసును కనిపించకుండా కుర్రకారు హృదయాలను కొల్లగొడుతూ.. అలెజాండ్రా మారిసా రోడ్రిగ్జ్ సరికొత్త చరిత్రను లిఖించింది. విజతగా ప్రకటించిన ఆమె మాట్లాడుతూ.. ‘అందాల పోటీల్లో సరికొత్త చరిత్రకు తాను ప్రాతినిధ్యం వహించడం హ్యపీగా ఉంది’ అంటూ ఆనందం వ్యక్తం చేసింది. ప్రస్తుతం అలెజాండ్రా మారిసా రోడ్రిగ్జ్ ఆమెకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అసలు ట్విస్ట్ ఏంటంటే అలెజాండ్రా మారిసా రోడ్రిగ్జ్ వృత్తిరీత్యా న్యాయవాది, పాత్రికేయురాలు కావడం విశేషం. 

Click Here For Twitter Post..

Tags:    

Similar News