'నిస్వార్థ కర్తవ్యానికి క్వీన్ ఎలిజబెత్ 2 ఉదాహరణ'

లండన్: క్వీన్ ఎలిజబెత్2 మరణానంతరం బాధ్యతలు స్వీకరించిన కింగ్ ఛార్లెస్ 3 పార్లమెంటులో తొలిసారిగా ప్రసంగించారు.Latest Telugu News

Update: 2022-09-12 12:57 GMT

లండన్: క్వీన్ ఎలిజబెత్2 మరణానంతరం బాధ్యతలు స్వీకరించిన కింగ్ ఛార్లెస్ 3 పార్లమెంటులో తొలిసారిగా ప్రసంగించారు. దివంగత క్వీన్ ఎలిజిబిత్ 2 నిస్వార్థ కర్తవ్యానికి ఉదాహరణగా నిలిచారని అన్నారు. బ్రిటీష్ చట్టసభ సభ్యుల సంప్రదాయాలను ఆయన ప్రశంసించారు. వెస్ట్ మినిస్టర్ హాల్‌లో అప్పర్ చాంబర్ హౌజ్, లోయర్ హౌజ్ ఆఫ్ కామన్స్‌కు ఎన్నికైన సభ్యులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 'నేను ఈ రోజు మీ ముందు నిలబడినప్పటికీ, మన చుట్టూ ఉన్న చరిత్ర భారాన్ని నేను మోయలేకుండా ఉండలేను' అని అన్నారు. ప్రజాస్వామ్యానికి పార్లమెంటు జీవన, శ్వాస వ్యవస్థ అని పేర్కొన్నారు. రాణి నిస్వార్థ కర్తవ్యానికి ఒక ఉదాహరణ అని చెప్పారు. దేవుని సహాయం, మీ సలహాలతో, తాను నమ్మకంగా అనుసరించాలని నిర్ణయించుకున్నట్లు అని తెలిపారు.

Similar News