ఇతను ఏం చేయకుండా రూ.2 కోట్లు సంపాదించాడట !

జపాన్‌కు చెందిన ఇతని పేరు షోజి మోరి మోటో

Update: 2022-12-05 07:07 GMT

దిశ, వెబ్ డెస్క్ : జపాన్‌కు చెందిన ఇతని పేరు షోజి మోరి మోటో..ఇతనికి మరొక పేరు కూడా ఉంది..అదే డు నథింగ్ మెన్.పేరుకు తగ్గట్టుగానే ఇతని ఏమి చేయడు. 2018 లో ఇతని ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఒక రెంటల్ సర్వీస్ ను మొదలు పెట్టాడు. దీని ద్వారా ఇతన్ని ఇతనే రెంటుకు ఇచ్చుకుంటాడు. ఎవరైతే ఇతన్ను రెంటుకు తీసుకుంటాడో వాళ్ళతో కలిసి తిరుగుతాడు.. తింటాడు..మాట్లాడతాడు. ఎవరైన ఏదయినా అడిగితే ఆన్సర్ చేస్తాడు..అంతే అంతకిమించి ఒక్క పని కూడా చేయడు. అంతే కాదు ఇతనుకు అయ్యే భోజనం ఖర్చులు, దారి ఖర్చులు ఇతన్ని రెంటుకు తీసుకునే వారు ఇస్తారు. రోజుకు కనీసం ఇతన్ని ముగ్గురైనా రెంట్‌కు తీసుకుంటారు. ఇతన్ని కలిసిన వారందరు బాధలు పంచుకుంటారట..అంతే కాకుండా రెస్టారెంట్ ఖాళీగా ఉన్నప్పుడు ఇతన్ని పిలిపించి ఉంచుతారట. ఇలా ఇతను ఏ పని చేయకుండా రూ. 2 కోట్లను సంపాదించాడట.    

Similar News