ఉగ్రవాదుల పంజా.. కారు బాంబు దాడిలో డిప్యూటీ గవర్నర్..

అఫ్గానిస్థాన్‌లో ఉగ్ర దాడి కలకలం రేపింది.

Update: 2023-06-06 13:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: అఫ్గానిస్థాన్‌లో ఉగ్ర దాడి కలకలం రేపింది. దేశంలోని బదాక్షన్ ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్ నాసిర్ అహ్మద్ అహ్మది కారు బాంబు పేలుడులో మృతి చెందారు. మంగళవారం జరిగిన ఈ ఘటనలో డిప్యూటీ గవర్నర్ డ్రైవర్ సైతం మరణించారు. మరో ఆరుగురు పౌరులు గాయపడ్డారు. కారు బాంబు దాడి ఘటనకు ఎవరు పాల్పడ్డారనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. తాలిబన్ల పాలనలో చోటు చేసుకున్న అతి పెద్ద పేలుడు ఇదేనని అధికార వర్గాలు తెలిపాయి. ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తి కారు నిండా పేలుడు పదార్థాలతో అహ్మది ప్రయాణిస్తున్న వాహనం సమీపంలోకి దూసుకొచ్చి పేల్చుకున్నాడు. ఐసిస్ ఉగ్రవాదులు పలు నగరాల్లో తీవ్రమైన దాడులు చేయగా వారికి వ్యతిరేకంగా తాలిబన్ ప్రభుత్వం సైతం దాడులను మొదలు పెట్టింది. గతంలో ఐసిస్ ఇదే ప్రావిన్స్ లో పోలీస్ చీఫ్ ను కూడా ఇటువంటి దాడిలోనే హత్య చేసింది. మార్చిలో బల్ఖ ప్రావిన్స్ గవర్నర్ ను చంపినట్లు ఇప్పటికే ఐసిస్ ప్రకటించింది.

Tags:    

Similar News