Cashew Nuts: కూరగాయలకంటే తక్కువ ధరకే జీడిపప్పు.. కేజీ రూ.15లే.. ఎక్కడో తెలుసా?

జీడిపప్పు(Cashew Nuts) ధర ఎక్కడ చూసినా ఎక్కువగానే ఉంటుంది. కేజీ జీడిపప్పు కొనాలంటే కచ్చితంగా రూ.800ల నుంచి రూ.1200 వరకూ ఉంటుంది. అందుకే సామాన్యులు దీనిని కొనలేకపోతున్నారు. మరి ఇంతటి ఖరీదైన జీడిపప్పు కేజీ రూ.15లకే దొరికితే.. డ్రైఫ్రూట్స్ ప్రియులకు పండగే మరి.

Update: 2023-05-07 20:20 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఆహారంలో డ్రైఫ్రూట్స్ (Dryfruits) తినడం వల్ల ఆరోగ్యం (Healthy)గా ఉంటారు. ఈ మధ్యకాలంలో ముఖ్యంగా కరోనా దెబ్బకు చాలా మంది సరైన ఆరోగ్య నియమాలు పాటిస్తూ డ్రైఫ్రూట్స్ కు అలవాటు పడుతున్నారు. ఈ డ్రైఫ్రూట్స్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జీడిపప్పు(Cashew Nuts). దీనిని తినేందుకు పెద్దల దగ్గరి నుంచి పిల్లల వరకూ అందరూ ఇష్టపడి తింటూ ఉంటారు. జీడిపప్పులో ప్రోటీన్లు(Proteins), ఫైబర్ వంటివి పుష్కలంగా ఉన్నాయి. ప్రతి రోజూ జీడిపప్పు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

జీడిపప్పు(Cashew Nuts) ధర ఎక్కడ చూసినా ఎక్కువగానే ఉంటుంది. కేజీ జీడిపప్పు కొనాలంటే కచ్చితంగా రూ.800ల నుంచి రూ.1200 వరకూ ఉంటుంది. అందుకే సామాన్యులు దీనిని కొనలేకపోతున్నారు. మరి ఇంతటి ఖరీదైన జీడిపప్పు కేజీ రూ.15లకే దొరికితే.. డ్రైఫ్రూట్స్ ప్రియులకు పండగే మరి. అంత తక్కువ ధరకు ఎక్కడ దొరుకుతుందని అనుకుంటున్నారా.. నిజంగానే కూరగాయలకంటే తక్కువ ధరకే జీడిపప్పు ఒక గ్రామంలో అమ్ముతున్నారు.

ఝార్ఖండ్ రాష్ట్రంలోని నాలా అనే గ్రామంలో జీడిపప్పు అతి తక్కువ ధరకే దొరుకుతోంది. అక్కడ జీడిపప్పు కేజీ రూ.15ల నుంచి రూ.40లలోపే ఉంది. రోడ్లపక్కన పండ్లూ, కూరగాయలు అమ్మినట్లుగా నాలా గ్రామంలో జీడీపప్పు(Cashew Nuts)ను అమ్ముతుంటారు. ఇంత తక్కువకే జీడిపప్పు దొరకడంతో పక్క రాష్ట్రాల నుంచి వ్యాపారులు ఇక్కడికొచ్చి చౌకగా జీడిపప్పును కోనుగోలు చేస్తుంటారు. అందుకే ఈ ఊరును క్యాషూ సిటీ ఆఫ్ ఝార్ఖండ్ (Cashew city Of Jharkand)గా పిలుస్తున్నారు. అంత ఖరీదైన జీడిపప్పును తక్కువ ధరకు అమ్మడానికి ఓ కారణం ఉంది.

గత కొన్నేళ్లకు ముందు నాలా గ్రామంలో పంటలేవీ సరిగా పండేవి కావు. పొలాలన్నీ బీడు భూములుగా మారాయి. ప్రజలను గమనించిన అటవీ శాఖ అధికారులు వారి కోసం 2010లో భూసార పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో అక్కడున్న భూములు జీడి పప్పు (Cashew Nuts) పంటలకు అనువైనవని గుర్తించారు. అప్పటి నుంచి రైతులకు ఉచితంగా జీడి గింజలు ఇచ్చి సాగు చేసేందుకు ప్రోత్సహిస్తున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు చేసిన పని వల్ల మొదటగా 50 ఎకరాల విస్తీర్ణంలో ప్రారంభమైన జీడితోటలు.. సాగు ద్వారా మంచి ఫలితాలు రావడంతో చాలా మంది దీనినే నమ్ముకున్నారు. ఇప్పుడు అక్కడున్నవారంతా జీడిపప్పుతో పాటు, పచ్చి జీడికాయలను కూడా అమ్ముతూ జీవిస్తున్నారు.

Tags:    

Similar News