జూన్ 1న టీమ్ ఇండియా వార్మప్ మ్యాచ్.. ఆ జట్టుతో ఢీ

టీ20 వరల్డ్ కప్‌కు సమయం దగ్గరపడుతున్నది. జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఈ పొట్టి ప్రపంచకప్‌కు ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే.

Update: 2024-05-17 12:39 GMT

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్‌కు సమయం దగ్గరపడుతున్నది. జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఈ పొట్టి ప్రపంచకప్‌కు ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. ఈ వరల్డ్ కప్‌కు ముందు వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఐసీసీ శుక్రవారం రిలీజ్ చేసింది. మే 27 నుంచి జూన్ 1 వరకు 16 సన్నాహాక మ్యాచ్‌లు జరగనున్నాయి. పొట్టి ప్రపంచకప్‌కు ముందు భారత జట్టు ఒక్క వార్మప్ మ్యాచ్ మాత్రమే ఆడనుంది. జూన్ 1న బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ అమెరికాలోనే జరగనుండగా.. ఇంకా వేదిక ఖరారవ్వలేదు.

ప్రస్తుతం ఐపీఎల్‌తో బిజీగా ఉన్న భారత ఆటగాళ్లు.. టీ20 వరల్డ్ కప్‌కు ఈ లీగ్‌ను సన్నాహకంగా వినియోగించుకున్నారు. జూన్ 5న ఐర్లాండ్‌తో ఆడటం ద్వారా టీమ్ ఇండియా మెగా ఈవెంట్‌ను మొదలుపెట్టనుంది. తర్వాతి మ్యాచ్‌లో జూన్ 9న పాక్‌ను ఢీకొట్టనుంది. ఐపీఎల్ నేపథ్యంలో భారత ఆటగాళ్లు రెండు గ్రూపులుగా అమెరికాకు వెళ్లనున్నారు. ఆస్ట్రేలియా, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ రెండేసి వార్మప్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఇంగ్లాండ్, పాకిస్తాన్ జట్లు ప్రాక్టీస్ మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాయి. ఈ నెలాఖరులో ఇరు జట్లు టీ20 సిరీస్‌లో ఎదురుపడుతుండటంతో వార్మప్ మ్యాచ్‌లు ఆడటం లేదు. 

Tags:    

Similar News