పండుగ వేళ మహిళల వినూత్న నిరసన.. బతుకమ్మకు బదులుగా..

దిశ, హుజూరాబాద్ రూరల్ : బతుకమ్మలకు బదులు.. గ్యాస్ సిలిండర్లు పెట్టి బతుకమ్మ ఆడి మహిళలు వినూత్నంగా నిరసన తెలిపారు. బుధవారం బతుకమ్మ పండుగ ప్రారంభం కాగా కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను నిరసిన తెలిపారు. ఈ సందర్బంగా పట్టణంలోని ప్రతాపవాడ శివాలయం వద్ద మహిళలు గ్యాస్ సిలిండర్ పెట్టి బతుకమ్మ పాటలు పాడుకున్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.230 ఉన్న గ్యాస్ ధరలను వెయ్యి రూపాయలకు పెంచి సామాన్యులపై పెనుభారం మోపిందంటూ పాటలు పాడుతూ తమ […]

Update: 2021-10-06 10:29 GMT

దిశ, హుజూరాబాద్ రూరల్ : బతుకమ్మలకు బదులు.. గ్యాస్ సిలిండర్లు పెట్టి బతుకమ్మ ఆడి మహిళలు వినూత్నంగా నిరసన తెలిపారు. బుధవారం బతుకమ్మ పండుగ ప్రారంభం కాగా కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను నిరసిన తెలిపారు.

ఈ సందర్బంగా పట్టణంలోని ప్రతాపవాడ శివాలయం వద్ద మహిళలు గ్యాస్ సిలిండర్ పెట్టి బతుకమ్మ పాటలు పాడుకున్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.230 ఉన్న గ్యాస్ ధరలను వెయ్యి రూపాయలకు పెంచి సామాన్యులపై పెనుభారం మోపిందంటూ పాటలు పాడుతూ తమ నిరసన గళాన్ని వినిపించారు.

Tags:    

Similar News