ఒక్కరోజులో రూ. 800 కోట్లు నష్టపోయిన రేఖా ఝున్‌ఝున్‌వాలా

టైటాన్ కంపెనీల షేర్లు ఇటీవల పతనం కావడంతో ఆమె ఏకంగా రూ. 800 కోట్లను కోల్పోయారు.

Update: 2024-05-07 14:15 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దివంగత ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా భార్య రేఖా ఝున్‌ఝున్‌వాలా ఒకే ఒక్కరోజులో వందల కోట్ల నష్టం చూశారు. ఒకప్పుడు రాకేష్ ఝున్‌ఝున్‌వాలాను కోటీశ్వరుడిని చేసిన టైటాన్ కంపెనీల షేర్లు ఇటీవల పతనం కావడంతో ఆమె ఏకంగా రూ. 800 కోట్లను కోల్పోయారు. టాటా గ్రూపునకు చెందిన టైటాన్ కంపెనీ సోమవారం విడుదల చేసిన త్రైమాసిక ఫలితాలు నిరాశపర్చడంతో షేర్లు క్షీణించాయి. 7 శాతానికి పైగా నష్టపోయి షేర్ రూ. 3,257కి చేరుకోవడంతో కంపెనీ మార్కెట్ విలువ కూడా భారీగా దెబ్బతిని రూ. 2.91 లక్షల కోట్లకు చేరుకుంది. టైటాన్‌లో 5.35 శాతం వాటా ఉన్న రేఖా ఝున్‌ఝున్‌వాలా రూ. 806 కోట్ల నష్టాన్ని చూడాల్సి వచ్చింది. దీంతో కంపెనీలో ఆమె పెట్టుబడుల విలువ రూ. 15,986 కోట్లకు చేరింది. కాగా, రాకేష్ ఝున్‌ఝున్‌వాలా 2002లో టైటార్ షేర్లను రూ. 3 చొప్పున కొన్నారు. అప్పటినుంచి కంపెనీ షేర్ విలువ క్రమంగా వందల రెట్లు పెరిగింది. అనేక సందర్భాల్లో రాకేష్ ఝున్‌ఝున్‌వాలా టైటాన్‌ను తనకెంతో ఇష్టమైన షేర్‌గా అభివర్ణించేవారు.

Tags:    

Similar News