తులం బంగారానికి ఎంత లోన్ వస్తుందో తెలుసా?

ప్రస్తుతం బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ లేదు. చాలా మంది గోల్డ్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే డబ్బులు ఎవరికి ఊరికే రావు అనే డైలాగ్ అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరికీ డబ్బు అవసరం ఉంటుంది. కానీ

Update: 2024-05-19 10:12 GMT

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ లేదు. చాలా మంది గోల్డ్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే డబ్బులు ఎవరికి ఊరికే రావు అనే డైలాగ్ అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరికీ డబ్బు అవసరం ఉంటుంది. కానీ అవి రావడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. కొంత మందికి అత్యవసరంగా మనీ అవసరం అవుతుంటాయి. దీంతో చాలా మంది పర్సనల్ లోన్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఎందుకంటే విత్ అవుట్ డాక్యుమెంటేషన్‌తో చాలా బ్యాంకులు వ్యక్తి గత రుణాలు అందిస్తున్నాయి. కానీ చాలా మందికి తెలియనిది ఏమిటంటే, పర్సనల్ లోన్ కంటే బంగారం మీద రుణం తీసుకోవడం చాలా మంచిది. దీని వలన వడ్డీ కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది,

అయితే ఎస్బీఐ బ్యాంకు గోల్డ్ మీద లోన్స్ ఇస్తుంది. బంగారాన్ని తనఖా పెట్టి ఈ బ్యాంకులో ఏకంగా రూ.50 లక్షల వరకు రుణం పొందవచ్చునంట. ఈఎంఐ ఆధారిత గోల్డ్ లోన్ మీద 25% మార్జిన్ ఉంటుంది. గోల్డ్ లోన్ మీద 25 శాతం మంజూరు ఉంటుంది.

గోల్డ్ లోన్‌కు సంబంధించిన ముఖ్యమైన సమాచారం.

1. 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

2. గోల్డ్ లోన్‌ కోసం కావాల్సిన పత్రాల్ని సమర్పించాలి.

3. గోల్డ్ లోన్ మీద సగటు వడ్డీ రేటు 8.75% నుండి మొదలవుతుంది.

4. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు 74,000 ఉంది. 90% వరకు లోన్ వస్తుంది అనుకున్నట్లయితే 66,600 వరకు చేతికి వస్తాయి.

5. 12 నెలలు టెన్యూర్ పెట్టుకుంటే, నెలకు ఈఎంఐ 3030 దాక కట్టాల్సి ఉంటుంది. మొత్తం 72,800 వరకు లోన్ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

Similar News