ఆర్టీసీ కార్మికులకు శుభవార్త

దిశ, న్యూస్ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు శుభవార్త అందించింది. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ 50 రోజులకు పైగా చేసిన సమ్మె కాలానికి జీతభత్యాలను ఇవ్వనున్నట్టు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.మూడు రోజుల్లోపు కార్మికుల ఖాతాల్లో వేతనాలు వేస్తామని చెప్పారు. సమ్మెకాలం వేతనానికి సంబంధించి రూ.235 కోట్లను ఒకే దఫాలో విడుదల చేస్తామని మరోసారి స్పష్టంచేశారు. గతంలోనే కేసీఆర్ చెప్పినట్టు మార్చి 31లోపు ఈ చెల్లింపులు చేసి ప్రభుత్వం […]

Update: 2020-03-11 04:06 GMT

దిశ, న్యూస్ బ్యూరో :
తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు శుభవార్త అందించింది. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ 50 రోజులకు పైగా చేసిన సమ్మె కాలానికి జీతభత్యాలను ఇవ్వనున్నట్టు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.మూడు రోజుల్లోపు కార్మికుల ఖాతాల్లో వేతనాలు వేస్తామని చెప్పారు. సమ్మెకాలం వేతనానికి సంబంధించి రూ.235 కోట్లను ఒకే దఫాలో విడుదల చేస్తామని మరోసారి స్పష్టంచేశారు. గతంలోనే కేసీఆర్ చెప్పినట్టు మార్చి 31లోపు ఈ చెల్లింపులు చేసి ప్రభుత్వం తన మాటను నిలబెట్టుకుంటోందని రవాణా శాఖ మంత్రి గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేసి ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని కోరారు.

Tags: rtc employees, strike month salary, fund release by ts govt, transport miniter ajay kumar

Tags:    

Similar News