AP Politics:ఆ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్న సినీ నటి నమిత

ఏపీలో ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉండడంతో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే ధర్మవరం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ కు మద్దతుగా గురువారం సినీ నటి నమిత ప్రచారం చేశారు.

Update: 2024-05-02 13:52 GMT

దిశ ప్రతినిధి,ధర్మవరం: ఏపీలో ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉండడంతో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ  క్రమంలోనే  ధర్మవరం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ కు మద్దతుగా గురువారం సినీ నటి నమిత ప్రచారం చేశారు. ముందుగా స్థానిక చౌడేశ్వరి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. గాంధీ నగర్ సర్కిల్ వద్ద సినీ నటి నమితను చూడటానికి పెద్ద సంఖ్యలో పట్టణ ప్రజలు హాజరయ్యారు. అనంతరం రోడ్‌షో పర్యటించి ఓటర్లను ఆకట్టుకునే విధంగా చిరునవ్వులు చిందిస్తూ కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు. సత్య కుమార్ ను అఖండ మెజార్టీతో విజయం సాధించడానికి ఓటర్లు తమ వంతు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు పరిచే సుధాకర్, కేసుగాల శ్రీనివాసులు, బీజేపీ నాయకుడు ఓబులేసు, తదితరులు పాల్గొన్నారు.

Similar News