లాక్‌డౌన్‌కు ముందు ఫుల్.. ప్రస్తుతం నిల్

దిశ, మహబూబ్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలోని అన్ని మద్యం షాపుల్లో సరుకు లెక్కించేందుకు వచ్చిన అధికారులు షాక్ అవుతున్నారు. లాక్‌డౌన్ సమయంలో లెక్కల్లో చూపించిన సరుకు నిల్వకు ప్రస్తుతం ఉన్న దానికి ఎక్కడా పొంతన లేకపోవడమే ఇందుకు కారణం. మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాదాపు అన్ని షాపుల్లో ఇదే పరిస్థితి కనిపిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. మంగళవారం సాయంత్రం పలుచోట్ల ఆబ్కారీ శాఖ అధికారులు మద్యం షాపుల్లో తనిఖీలు చేయగా ఖరీదైన మద్యం బాటిళ్లు కనిపించలేదు. కేవలం […]

Update: 2020-05-05 09:47 GMT

దిశ, మహబూబ్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలోని అన్ని మద్యం షాపుల్లో సరుకు లెక్కించేందుకు వచ్చిన అధికారులు షాక్ అవుతున్నారు. లాక్‌డౌన్ సమయంలో లెక్కల్లో చూపించిన సరుకు నిల్వకు ప్రస్తుతం ఉన్న దానికి ఎక్కడా పొంతన లేకపోవడమే ఇందుకు కారణం. మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాదాపు అన్ని షాపుల్లో ఇదే పరిస్థితి కనిపిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. మంగళవారం సాయంత్రం పలుచోట్ల ఆబ్కారీ శాఖ అధికారులు మద్యం షాపుల్లో తనిఖీలు చేయగా ఖరీదైన మద్యం బాటిళ్లు కనిపించలేదు. కేవలం చీప్ లిక్కర్ మాత్రమే షాపుల్లో దర్శనమిస్తోందని సమాచారం. సరుకు అంతా ఎక్కడికి వెళ్లిందని షాపుల యజమానులను ప్రశ్నించగా వారి నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

Tags: wine shop full, stock nil, excise officers shock, all districts same situation

Tags:    

Similar News