తర్వాతి మహమ్మారికి రెడీగా ఉండండి -WHO

దిశ, వెబ్ డెస్క్: కరోనా మహమ్మారి వ్యాప్తిని నిలువరించగలిగిన దేశాలు, నగరాలను ప్రశంసించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అలాగే, తర్వాత వచ్చే మహమ్మారిని ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలని దేశాధినేతలకు పిలుపునిచ్చింది. 73వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ గురువారం ఆన్‌లైన్‌లో నిర్వహించారు. అనంతరం విడుదల చేసిన ప్రకటనలో కరోనా కట్టడికి ప్రపంచ దేశాలు అత్యవసరం ఏర్పాటు చేసుకున్న ఆరోగ్య వ్యవస్థలను ఈ ఏడాది చూశామన్నారు. అయితే, భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటినుంచే తర్వాత వచ్చే మహమ్మారి కోసం […]

Update: 2020-11-06 11:52 GMT

దిశ, వెబ్ డెస్క్: కరోనా మహమ్మారి వ్యాప్తిని నిలువరించగలిగిన దేశాలు, నగరాలను ప్రశంసించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అలాగే, తర్వాత వచ్చే మహమ్మారిని ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలని దేశాధినేతలకు పిలుపునిచ్చింది. 73వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ గురువారం ఆన్‌లైన్‌లో నిర్వహించారు. అనంతరం విడుదల చేసిన ప్రకటనలో కరోనా కట్టడికి ప్రపంచ దేశాలు అత్యవసరం ఏర్పాటు చేసుకున్న ఆరోగ్య వ్యవస్థలను ఈ ఏడాది చూశామన్నారు.

అయితే, భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటినుంచే తర్వాత వచ్చే మహమ్మారి కోసం సంసిద్ధంగా ఉండాలని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. సామాజిక, రాజకీయ, ఆర్థిక సుస్థిరతకు ఆరోగ్యమే కీలకమని కరోనా స్పష్టం చేసిందని పేర్కొంది. సైన్స్, పరిష్కారాల, సంఘీభావంతో ఈ మహమ్మారిని ఎదుర్కోగలమని వివరించింది. టీకా కోసం ప్రపంచదేశాలన్నీ తొలిసారిగా ఏకతాటి మీదకు వచ్చాయని, ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఆరోగ్య వసతి సమానంగా కల్పించాలని దేశాలన్నీ భావిస్తున్నాయని తెలిపింది. ఇక ముందూ ఆరోగ్య సంక్షోభాలను ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండాలని సూచించింది.

Tags:    

Similar News