‘వైట్ టైగర్’ ఫస్ట్ లుక్ రిలీజ్

దిశ, వెబ్ డెస్క్: ప్రియాంక చోప్రా లేటెస్ట్ మూవీ వైట్ టైగర్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. రమిన్ బహ్రాని డైరెక్ట్ చేస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రం ది న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్ అండ్ 2008 మ్యాన్ బుకర్ ప్రైజ్ విన్నింగ్ నావెల్ ఆధారంగా తెరకెక్కకింది. బలరామ్ హల్వాయ్ అనే వ్యక్తి, తన కుటుంబం దుస్థితి గురించి తెలిపే కథ కాగా, బలరామ్ హల్వాయ్‌గా ఆదర్ష్ గౌరవ్ అద్భుతంగా నటించాడు అని కాంప్లిమెంట్స్ ఇచ్చింది. చాలా […]

Update: 2020-10-16 06:17 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రియాంక చోప్రా లేటెస్ట్ మూవీ వైట్ టైగర్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. రమిన్ బహ్రాని డైరెక్ట్ చేస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రం ది న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్ అండ్ 2008 మ్యాన్ బుకర్ ప్రైజ్ విన్నింగ్ నావెల్ ఆధారంగా తెరకెక్కకింది. బలరామ్ హల్వాయ్ అనే వ్యక్తి, తన కుటుంబం దుస్థితి గురించి తెలిపే కథ కాగా, బలరామ్ హల్వాయ్‌గా ఆదర్ష్ గౌరవ్ అద్భుతంగా నటించాడు అని కాంప్లిమెంట్స్ ఇచ్చింది. చాలా కాలం తర్వాత తను చూసిన అత్యంత గొప్ప పర్ఫార్మెన్స్‌లో ఆదర్ష్ ఒకరన్నారు. గ్రామం నుంచి వచ్చిన నిరుపేద వ్యక్తి అయిన బలరామ్ విజయవంతం అయినా వ్యవస్థపకుడిగా ఎదిగే తన జీవితం..ఆధునిక భారతదేశంలో ఆకలి, అవకాశాలు లేకపోవడం మానవుడి మనుగడను ఎలా నిర్మించగలదో చూపిస్తుందని తెలిపింది ప్రియాంక. భారతదేశంలోని అత్యంత ప్రతిభావంతులైన నటుల్లో ఒకరైన రాజ్‌కుమార్‌రావు..యాక్టింగ్‌లో డెప్త్ చూపించే చాలా తక్కువ మంది నటుల్లో ఒకరని కాంప్లిమెంట్స్ ఇచ్చింది. సినిమా ఆడియన్స్ కొంచెం కంఫర్ట్‌గా అనిపించక పోయినా.. వంద శాతం ఎంటర్టై‌న్ చేస్తుందని చెప్పింది.

ఇక సినిమాలో తన క్యారెక్టర్ పింకీ మేడం‌గా పరిచయం చేసిన ప్రియాంక..ఆ క్యారెక్టర్ ప్లే చేస్తున్నందుకు సంతోషంగా ఉన్నట్లు తెలిపింది.

Tags:    

Similar News