భారత ఆర్థికవృద్ధిలో నగరాలదే కీలకపాత్ర!

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 సంక్షోభం కారణంగా భారత్‌లోని నగరాలు ఆర్థికంగా దారుణంగా దెబ్బతిన్నప్పటికీ, కరోనా తర్వాత దేశ ఆర్థికవ్యవస్థ పుంజుకోవడంలోనూ ఈ నగరాలదే కీలక పాత్ర ఉండనుందని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్) నివేదిక వెల్లడించింది. దేశ జీడీపీలో సుమారు 70 శాతం వరకు నగరాలదే వాటా ఉందని, అదేవిధంగా దేశంలో ప్రతి నిమిషానికి 25-30 మంది గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలస వెళ్తున్నట్టు ఈ నివేదిక తెలిపింది. ఈ నివేదిక ప్రకారం.. దేశంలోని దాదాపు రెండున్నర […]

Update: 2021-01-10 07:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 సంక్షోభం కారణంగా భారత్‌లోని నగరాలు ఆర్థికంగా దారుణంగా దెబ్బతిన్నప్పటికీ, కరోనా తర్వాత దేశ ఆర్థికవ్యవస్థ పుంజుకోవడంలోనూ ఈ నగరాలదే కీలక పాత్ర ఉండనుందని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్) నివేదిక వెల్లడించింది. దేశ జీడీపీలో సుమారు 70 శాతం వరకు నగరాలదే వాటా ఉందని, అదేవిధంగా దేశంలో ప్రతి నిమిషానికి 25-30 మంది గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలస వెళ్తున్నట్టు ఈ నివేదిక తెలిపింది.

ఈ నివేదిక ప్రకారం.. దేశంలోని దాదాపు రెండున్నర కోట్ల కుటుంబాలు పట్టణ ప్రాంతాల్లో 35 శాతం కుటుంబాలు మార్కెట్ ధరలు ఇళ్లను కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్నట్టు పేర్కొంది. కరోనా సంక్షోభాన్ని ఉపయోగించుకుని పట్టణాల రూపురేఖల్ని మార్చుకోవచ్చని, ప్రజలకు అందించాల్సిన మెరుగైన వైద్య సౌకర్యాలతో పాటు మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని నివేదిక అభిప్రాయపడింది.

కరోనా మహమ్మరి అనేక వర్గాలపై అనేక రకాల ప్రభావాలను చూపిందని, పేద, మధ్య ఆదాయ వర్గాలు ఉపాధిని కోల్పోయాయని, ముఖ్యంగా ఆరోగ్య, సామాజిక భద్రతను కోల్పోయినట్టు ఐడీఎఫ్‌సీ ఇన్‌స్టిట్యూట్‌తో డబ్ల్యూఈఎఫ్‌ రూపొందించిన నివేదిక వెల్లడించింది. పాతకాలం నాటి మార్గదర్శకాలతో పాటు ప్రణాళికలను వదులుకోవాలని, నగరాల్లో రవాణాతో పాటు మౌలిక వసతుల అభివృద్ధి కోసం మెరుగైన చర్యలను తీసుకోవడం మేలని నివేదిక తెలిపింది. రెంటల్ హౌసింగ్ మార్కెట్‌ను మరింత పటిష్ఠం చేసేందుకు చర్యలను చేపట్టాలని వెల్లడించింది.

Tags:    

Similar News