బెంగళూరులో వారంపాటు లాక్‌డౌన్

బెంగళూరు: కరోనా కేసులను అదుపులో పెట్టడానికి కర్ణాటక సర్కారు రాష్ట్ర రాజధాని బెంగళూరులో వారంపాటు లాక్‌డౌన్ విధించడానికి సిద్ధమైంది. ఈ నెల 14 తేదీ రాత్రి ఎనిమిది గంటల నుంచి 22వ తేదీ ఉదయం 5 గంటల వరకు బెంగళూరు పట్టణ, రూరల్ జిల్లాలో లాక్‌డౌన్ అమలవుతుందని రాష్ట్ర సీఎం బిఎస్ యడ్యూరప్ప ప్రకటించారు. ఈ కాలంలో పాలు, పండ్లు, కూరగాయలు, ఔషధాలు, అత్యవసర సరుకులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. నిపుణుల కమిటీ సూచనల మేరకే ఈ […]

Update: 2020-07-11 11:53 GMT

బెంగళూరు: కరోనా కేసులను అదుపులో పెట్టడానికి కర్ణాటక సర్కారు రాష్ట్ర రాజధాని బెంగళూరులో వారంపాటు లాక్‌డౌన్ విధించడానికి సిద్ధమైంది. ఈ నెల 14 తేదీ రాత్రి ఎనిమిది గంటల నుంచి 22వ తేదీ ఉదయం 5 గంటల వరకు బెంగళూరు పట్టణ, రూరల్ జిల్లాలో లాక్‌డౌన్ అమలవుతుందని రాష్ట్ర సీఎం బిఎస్ యడ్యూరప్ప ప్రకటించారు. ఈ కాలంలో పాలు, పండ్లు, కూరగాయలు, ఔషధాలు, అత్యవసర సరుకులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. నిపుణుల కమిటీ సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ప్రజలందరూ ప్రభుత్వ ఆదేశాలను గౌరవించి పాటించాలని, కరోనాను కట్టడి చేయడంలో పాలుపంచుకోవాలని కోరారు.

Tags:    

Similar News