చేతులెత్తి వేడుకుంటున్నాం.. బయటకు రావొద్దు

దిశ, మహబూబ్ నగర్: లాక్‌డౌన్ నిబంధనలు బ్రేక్ చేస్తూ రోడ్లపైకి వస్తున్న వారు దయచేసి ఇళ్లలోనే ఉండాలని చేతులు జోడించి వేడుకుంటున్నామని వనపర్తి సీఐ సూర్యానాయక్ అన్నారు. గురువారం మహబూబ్‌నగర్‌లోని ఏకో పార్క్, సూర్యచంద్ర స్కూల్ ప్రాంతాల్లో గుంపులు గుంపులుగా వాకింగ్ చేస్తున్న వారిని పోలీసులు గుర్తించారు. బయటకు రావొద్దని ఎన్నిమార్లు చెప్పినా రోడ్లపై ఎందుకు తిరుగుతున్నారని వారిని సీఐ ప్రశ్నించారు. పక్క జిల్లాలైన గద్వాల, కర్నూలులో పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో తెలియదా అని మండిపడ్డారు. […]

Update: 2020-04-23 03:48 GMT

దిశ, మహబూబ్ నగర్: లాక్‌డౌన్ నిబంధనలు బ్రేక్ చేస్తూ రోడ్లపైకి వస్తున్న వారు దయచేసి ఇళ్లలోనే ఉండాలని చేతులు జోడించి వేడుకుంటున్నామని వనపర్తి సీఐ సూర్యానాయక్ అన్నారు. గురువారం మహబూబ్‌నగర్‌లోని ఏకో పార్క్, సూర్యచంద్ర స్కూల్ ప్రాంతాల్లో గుంపులు గుంపులుగా వాకింగ్ చేస్తున్న వారిని పోలీసులు గుర్తించారు. బయటకు రావొద్దని ఎన్నిమార్లు చెప్పినా రోడ్లపై ఎందుకు తిరుగుతున్నారని వారిని సీఐ ప్రశ్నించారు. పక్క జిల్లాలైన గద్వాల, కర్నూలులో పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో తెలియదా అని మండిపడ్డారు. పోలీసులకు, ప్రభుత్వానికి సహకరించాలని ప్రతిరోజూ చెబుతున్నా నిబంధనలు అతిక్రమించడం సరికాదన్నారు. ఇకమీదట లా‌‌క్‌డౌన్ నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదన్నారు. చట్టప్రకారం కేసులు నమోదు చేస్తామని సీఐ తెలిపారు.

Tags: corona,lockdown, requesting as namaste, wanaparthy ci surya naik

Tags:    

Similar News