తెవాటియా ఏదైనా చేయగలడు : సెహ్వాగ్

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే సెహ్వాగ్… క్రీడాకారులపై ప్రసంశలు, విమర్శలు చేస్తుంటాడు. అందులో భాగంగానే ఈ ఐపీఎల్ సీజన్‌లో అద్భుతంగా రాణిస్తున్న రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ రాహుల్ తెవాటియాను ప్రసంశించారు. శనివారం మధ్యాహ్నం బెంగళూర్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన రాణించిన తేవాటియాను సెహ్వాగ్ అభినందించాడు. ఈ సందర్భంగా సెహ్వాగ్ మాట్లాడుతూ… తేవాటియా ఏదైనా చేయగలడు.. అతనికి […]

Update: 2020-10-17 22:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే సెహ్వాగ్… క్రీడాకారులపై ప్రసంశలు, విమర్శలు చేస్తుంటాడు. అందులో భాగంగానే ఈ ఐపీఎల్ సీజన్‌లో అద్భుతంగా రాణిస్తున్న రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ రాహుల్ తెవాటియాను ప్రసంశించారు.

శనివారం మధ్యాహ్నం బెంగళూర్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన రాణించిన తేవాటియాను సెహ్వాగ్ అభినందించాడు. ఈ సందర్భంగా సెహ్వాగ్ మాట్లాడుతూ… తేవాటియా ఏదైనా చేయగలడు.. అతనికి అవకాశం ఇస్తే కోవిడ్‌కు వ్యాక్సిన్ కనిపెట్టగలడంటూ కామెంట్ చేశాడు. ఈ మేరకు రాహుల్ తెవాటియా పట్టిన ఓ క్యాచ్‌ను ట్విటర్‌లో పోస్ట్ చేశాడు.

Tags:    

Similar News