ఎన్నికల వేళ అన్నాడీఎంకే, బీజేపీ కూటమికి షాక్

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ తమిళనాడులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రోజుకో కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. వచ్చే నెలలో ఎన్నికల పోలింగ్ జరగనున్న క్రమంలో తాజాగా తమిళనాట మరో రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. అన్నాడీఎంకే, బీజేపీ కూటమి నుంచి బయటికొస్తున్నట్లు నటుడు, దేశియా ముర్పోక్కు ద్రవిడ కజగం పార్టీ(DMDK) అధ్యక్షుడు విజయకాంత్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. ఉన్నట్లుంది కూటమి నుంచి DMDK బయటికి వెళ్లిపోవడంతో ఎన్నికల వేళ అన్నాడీఎంకే, బీజేపీ కూటమికి షాక్ తగిలినట్లయింది. అయితే […]

Update: 2021-03-09 02:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ తమిళనాడులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రోజుకో కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. వచ్చే నెలలో ఎన్నికల పోలింగ్ జరగనున్న క్రమంలో తాజాగా తమిళనాట మరో రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. అన్నాడీఎంకే, బీజేపీ కూటమి నుంచి బయటికొస్తున్నట్లు నటుడు, దేశియా ముర్పోక్కు ద్రవిడ కజగం పార్టీ(DMDK) అధ్యక్షుడు విజయకాంత్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు.

ఉన్నట్లుంది కూటమి నుంచి DMDK బయటికి వెళ్లిపోవడంతో ఎన్నికల వేళ అన్నాడీఎంకే, బీజేపీ కూటమికి షాక్ తగిలినట్లయింది. అయితే DMDK బయటికి రావడానికి ఒక కారణం వినిపిస్తోంది. సీట్ల సర్దుబాటు కుదరకపోవడం వల్లనే DMDK బయటికొచ్చినట్లు తెలుస్తోంది. DMDK అడిగినన్నీ సీట్లు అన్నాడీఎంకే ఇవ్వలేదని సమాచారం.

గతవారంలో అన్నాడీఎంకే, బీజేపీ తమ మధ్య కుదిరిన సీట్ల ఒప్పందాన్ని ప్రకటించాయి. బీజేపీకి అన్నాడీఎంకే 25 సీట్లు కేటాయించింది. కానీ DMDKకు ఆశించినంత సీట్లు కేటాయించకపోవడంతో కూటమి నుంచి బయటికొచ్చినట్లు సమాచారం.

Tags:    

Similar News