అభివృద్ధికే ఓటు వేయండి అన్న రష్మిక.. మోడీ రియాక్షన్ ఇదే!

ఈ మధ్య రష్మిక చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఒక పార్టీకి ప్రచారం చేస్తూ ఆమె.. అభివృద్దికే ఓటు వేయండి అంటూ వీడియోలో చెప్పుకొచ్చింది. అయితే ఆమె ఈ మధ్య ముంబైలో ప్రతిష్టాత్మకంగా

Update: 2024-05-17 06:59 GMT

దిశ, సినిమా : ఈ మధ్య రష్మిక చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఒక పార్టీకి ప్రచారం చేస్తూ ఆమె.. అభివృద్దికే ఓటు వేయండి అంటూ వీడియోలో చెప్పుకొచ్చింది. అయితే ఆమె ఈ మధ్య ముంబైలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సముద్రపు వంతెన.. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ పై ప్రయాణం చేశారు. అందులో భాగంగా ఆమె ఆ వంతెనపై తన ప్రయాణ అనుభూతిని పంచుకుంటూ.. రెండు గంటల ప్రయాణం ఇరవై నిమిషాల్లో పూర్తి అవుతోందని ఊహించలేదు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుంది. మీరు కల్లు తెరవండి. 22 కిలోమీటర్ల పొడవున నిర్మించిన ఈ ఆరు లేన్ల వంతెన ప్రయాణ సమయాన్ని 2 గంటల నుంచి కేవలం 20 నిమిషాలకు తగ్గిస్తుందని ఆమె చెప్పారు. భారత్ పెద్ద కలలు కలలేదన్నారు కానీ.. కేవలం ఏడేళ్లలోనే ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశారన్నారు. అటల్ సేతుతో వికసిత భారత్‌కి ద్వారాలు తెరుచుకున్నాయన్న రష్మిక.. ఇది కేవలం బ్రిడ్జి కాదు మన యువ భారత్‌కు గ్యారంటీ అన్నారు. అందుకే అందరూ తప్పకుండా అభివృద్దికే ఓటు వేయాలని చెప్పుకొచ్చారు.

అయితే తాజాగా రష్మిక చేసిన వీడియోపై ప్రధాని మోడీ స్పందించారు. ఆయన రిప్లై ఇస్తూ..ఖచ్చితంగా! ప్రజలను కనెక్ట్ చేయడం మరియు జీవితాలను మెరుగుపరచడం కంటే సంతృప్తికరమైనది మరొకటి లేదు. అన్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక రష్మిక పాన్ ఇండియా మూవీ పుష్ప2లో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

Similar News