మాట తప్పం, మడమ తిప్పం అంటే ఇదేనా?

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్టిక్కర్ సీఎంగా మారుతున్నారని బీజేపీ ఏపీ ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లు మార్చి ఆ పథకాలు రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ఇలాగే మార్చితే ప్రజా ఆందోళన ఎదుర్కోక తప్పదని ఆయన హెచ్చరించారు. సీఎం సిట్టక్కర్ సీఎంగా మారిపోతున్నారని, నవరత్నాలు కేంద్ర ఫథకాలుగా ఆంధ్రా ప్రజలనుకుంటున్నారని అన్నారు. మాట తప్పం, […]

Update: 2020-07-12 05:18 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్టిక్కర్ సీఎంగా మారుతున్నారని బీజేపీ ఏపీ ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లు మార్చి ఆ పథకాలు రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ఇలాగే మార్చితే ప్రజా ఆందోళన ఎదుర్కోక తప్పదని ఆయన హెచ్చరించారు. సీఎం సిట్టక్కర్ సీఎంగా మారిపోతున్నారని, నవరత్నాలు కేంద్ర ఫథకాలుగా ఆంధ్రా ప్రజలనుకుంటున్నారని అన్నారు. మాట తప్పం, మడమ తిప్పం అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. కేంద్ర పథకాలను రాష్ట్రంలో పేరు మార్చి తమ సొంత పథకాలుగా చేసే ప్రచారాన్ని ఆపాలన్నారు. ఇకపై ఏ కేంద్ర ప్రభుత్వ పథక ప్రకటనైనా రాష్ట్రంలో జారీ చేస్తే అందులో ప్రధాన మంత్రి ఫోటో, కేంద్ర ప్రభుత్వ లోగో తప్పనిసరిగా ముద్రించాలన్నారు. అలా జరగని పక్షంలో ఆ పథకానికయ్యే పూర్తి ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలన్నారు. పథకాల ప్రారంభ సమయంలో కేంద్ర సహాయం ఎంతో తెలపాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News