సర్జికల్ స్ట్రైక్ అంటే బండి సంజయ్‎కు తెలుసా..?

దిశ, వెబ్ డెస్క్: బండి సంజయ్‎కు సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఏంటో తెలియకుండా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. మత సామరస్యంతో ఉండే హైదరాబాద్‎ను నాశనం చేయాలనుకుంటున్నారని విమర్శించారు. బండి సంజయ్‎కు రాజకీయ అవగాహన లేదని అర్థమవుతోందన్నారు. ఆయన చిల్లర రాజకీయాలు చేస్తే నడవదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ కార్పొరేటర్‎ను తెచ్చి రాష్ట్ర అధ్యక్షుడిని చేస్తే ఇలాగే ఉంటుదని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ దొంగ నాటకాలు […]

Update: 2020-11-25 02:26 GMT

దిశ, వెబ్ డెస్క్: బండి సంజయ్‎కు సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఏంటో తెలియకుండా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. మత సామరస్యంతో ఉండే హైదరాబాద్‎ను నాశనం చేయాలనుకుంటున్నారని విమర్శించారు. బండి సంజయ్‎కు రాజకీయ అవగాహన లేదని అర్థమవుతోందన్నారు. ఆయన చిల్లర రాజకీయాలు చేస్తే నడవదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ కార్పొరేటర్‎ను తెచ్చి రాష్ట్ర అధ్యక్షుడిని చేస్తే ఇలాగే ఉంటుదని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ దొంగ నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు.

Tags:    

Similar News