నిబంధనలకు లోబడే UPSC ఫలితాలు

దిశ, వెబ్ డెస్క్:`ఇటీవల విడుదలైన సివిల్స్ ఫలితాలపై వస్తున్న విమర్శలపై యూపీఎస్సీ స్పందించింది. భర్తీ చేయదలచిన ఖాళీల కంటే తక్కువ సంఖ్యలో అభ్యర్థులను ఎంపిక చేశారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై యూపీఎస్సీ స్పందిస్తూ .. సివిల్ సర్వీసుల పరీక్షల నిబంధనలు -2019కు అనుగుణంగా రిజర్వ్ జాబితాను విడుదల చేశామని ప్రకటించింది. 927 ఖాళీలకు గాను తొలి విడతగా 829 మంది అభ్యర్థుల ఫలితాల జాబితాను ప్రకటించామని స్పష్టంచేసింది. మిగతావి త్వరలోనే వెల్లడిస్తామని యూపీఎస్సీ తెలిపింది.

Update: 2020-08-06 09:13 GMT

దిశ, వెబ్ డెస్క్:'ఇటీవల విడుదలైన సివిల్స్ ఫలితాలపై వస్తున్న విమర్శలపై యూపీఎస్సీ స్పందించింది. భర్తీ చేయదలచిన ఖాళీల కంటే తక్కువ సంఖ్యలో అభ్యర్థులను ఎంపిక చేశారనే ప్రచారం జరుగుతోంది.

దీనిపై యూపీఎస్సీ స్పందిస్తూ .. సివిల్ సర్వీసుల పరీక్షల నిబంధనలు -2019కు అనుగుణంగా రిజర్వ్ జాబితాను విడుదల చేశామని ప్రకటించింది. 927 ఖాళీలకు గాను తొలి విడతగా 829 మంది అభ్యర్థుల ఫలితాల జాబితాను ప్రకటించామని స్పష్టంచేసింది. మిగతావి త్వరలోనే వెల్లడిస్తామని యూపీఎస్సీ తెలిపింది.

Tags:    

Similar News