సీఏఏ ఆందోళనకారుల ఫొటోలతో బ్యానర్లు

లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.. సీఏఏ వ్యతిరేక ఆందోళనకారులను మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. 28 మంది నిరసనకారుల పేర్లు, ఫొటోలు, చిరునామాలతో రాజధాని లక్నోలో రద్దీగా ఉన్న ట్రాఫిక్ కూడళ్ల దగ్గర హోర్డింగ్‌లు పెట్టించింది. డిసెంబర్‌లో యూపీలో పెద్ద ఎత్తున సీఏఏ వ్యతిరేక ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. ఆ ఆందోళనల్లో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయని, ఆ నష్టాన్ని ఆందోళనకారుల నుంచి సొమ్ము వసూలు చేసే పూడ్చుతామని సీఎం ప్రకటించారు. ఇప్పుడు హోర్డింగ్‌లపైకి ఎక్కిన వారు ఒక్కొక్కరు రూ. […]

Update: 2020-03-07 08:35 GMT

లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.. సీఏఏ వ్యతిరేక ఆందోళనకారులను మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. 28 మంది నిరసనకారుల పేర్లు, ఫొటోలు, చిరునామాలతో రాజధాని లక్నోలో రద్దీగా ఉన్న ట్రాఫిక్ కూడళ్ల దగ్గర హోర్డింగ్‌లు పెట్టించింది. డిసెంబర్‌లో యూపీలో పెద్ద ఎత్తున సీఏఏ వ్యతిరేక ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. ఆ ఆందోళనల్లో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయని, ఆ నష్టాన్ని ఆందోళనకారుల నుంచి సొమ్ము వసూలు చేసే పూడ్చుతామని సీఎం ప్రకటించారు. ఇప్పుడు హోర్డింగ్‌లపైకి ఎక్కిన వారు ఒక్కొక్కరు రూ. 63 లక్షలు చెల్లించాలని ఫిబ్రవరిలోనే సర్కారు నోటీసులు పంపింది. ఇప్పుడు ఆందోళనకారుల ఫొటోలు, వివరాలతో బ్యానర్లు పెట్టింది. హోర్డింగ్‌లు, బ్యానర్లు పెట్టి సర్కారు.. నేమ్ షేమింగ్‌కు పాల్పడుతున్నదని నిరసనకారులు మండిపడుతున్నారు.

Tags: caa protest, banners, hoardings, photos, lucknow, traffic

Tags:    

Similar News