ఎయిరిండియా ఫ్లైట్ ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. ప్రయాణికులకు తప్పిన పెను ప్రమాదం

ఆదివారం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం బెంగళూరు నుంచి కొచ్చికి బయలుదేరింది.

Update: 2024-05-19 04:25 GMT

దిశ వెబ్ డెస్క్: ఆదివారం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం బెంగళూరు నుంచి కొచ్చికి బయలుదేరింది. అయితే విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే విమానం ఇంజిన్‌లలో ఒకదానిలో మంటలు చెలరేగాయి. ఇది గమనించిన సిబ్బంది అప్రమత్తమై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు సమాచారం అందించారు. దీనితో విమానాన్ని బెంగళూరులో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.

కాగా ఆ ఘటనపై బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ నిర్వాహకులు మాట్లాడుతూ.. బెంగళూరు నుంచి కొచ్చి వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే విమానం ఇంజిన్‌లలో ఒకదానిలో మంటలు చెలరేగాయని, దీనితో విమానాన్ని బెంగళూరులో అత్యవసరంగా ల్యాండింగ్ చేసినట్టు పేర్కొన్నారు.

కాగా విమానం ఇంజిన్‌లలో ఒకదానిలో మంటలు చెలరేగిన సమయంలో విమానంలో 179 మంది ప్రయాణికులతోపాటు ఆరుగురు సిబ్బంది ఉన్నట్టు పేర్కొన్నారు. అయితే ఈ ఘటనలోఎవరూ గాయపడలేదని తెలిపారు. కగా ప్రయానికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని.. వీలైనంత త్వరగా వారి గమ్యస్థానానికి చేర్చడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

Similar News