గిఫ్ట్ బాక్సు‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి

దిశ, వెబ్ డెస్క్: ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించడంలో భాగంగా “గిఫ్ట్ బాక్సు” ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. ఈ గిఫ్టు బాక్సులో రంగురంగులతో కూడిన నాలుగు సిల్కు మాస్కులు ఉంటాయి. కాగితపు పెట్టెలో మాస్కులను ప్యాకింగ్ చేశారు. పండుగల సమయంలో అందరికీ పంపిణీ చేయడానికి తగిన ఉత్పత్తి అని గడ్కరీ అన్నారు. కె.వి.ఐ.సి. మాస్కు తయారీతో చేనేత కళాకారులకు జీవనోపాధి కల్పించించారని గడ్కరీ అన్నారు. విదేశీ మార్కెట్‌ను దృష్టిలో […]

Update: 2020-08-01 10:57 GMT

దిశ, వెబ్ డెస్క్: ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించడంలో భాగంగా “గిఫ్ట్ బాక్సు” ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. ఈ గిఫ్టు బాక్సులో రంగురంగులతో కూడిన నాలుగు సిల్కు మాస్కులు ఉంటాయి. కాగితపు పెట్టెలో మాస్కులను ప్యాకింగ్ చేశారు. పండుగల సమయంలో అందరికీ పంపిణీ చేయడానికి తగిన ఉత్పత్తి అని గడ్కరీ అన్నారు. కె.వి.ఐ.సి. మాస్కు తయారీతో చేనేత కళాకారులకు జీవనోపాధి కల్పించించారని గడ్కరీ అన్నారు. విదేశీ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకునే “గిఫ్టు బాక్సు” ను ప్రారంభించామని కె.వి.ఐ.సి. చైర్మన్ వినయ్ కుమార్ సక్సేనా తెలిపారు.

Tags:    

Similar News