ఎయిర్ ఫోర్స్ కాన్వాయ్‌పై ఉగ్రదాడి: ఐదుగురు సైనికులకు గాయాలు

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చి పోయారు. పూంచ్ జిల్లాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఎఎఫ్)కు చెందిన కాన్వాయ్‌పై శనివారం ఒక్కసారిగా కాల్పులకు పాల్పడ్డారు.

Update: 2024-05-04 16:51 GMT

 దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చి పోయారు. పూంచ్ జిల్లాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఎఎఫ్)కు చెందిన కాన్వాయ్‌పై శనివారం ఒక్కసారిగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు సైనికులకు తీవ్ర గాయాలయ్యాయి. సూరంకోట్‌లోని సనాయ్ గ్రామం వైపు కాన్వాయ్ వెళ్తుండగా..ఈ అటాక్ జరిగినట్టు అధికారులు తెలిపారు. దాడిపై సమాచారం అందుకున్న వెంటనే అదనపు బలగాలను ఘటనా స్థలంలో మోహరించారు. గాయపడిన జవాన్లను ఉదంపూర్ ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు ఆపరేషన్ ప్రారంభించాయి. స్థానిక రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్ ఈ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ నిర్వహించినట్టు ఐఏఎఫ్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది. షాసితార్ సమీపంలోని ఎయిర్ బేస్ లోపల వాహనాలను భద్రపరిచినట్టు వెల్లడించింది. అయితే ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు. కాగా, ఈ ఏడాది సాయుధ బలగాలపై జరిగిన అతిపెద్ద దాడి ఇదే కావడం గమనార్హం. మరోవైపు దేశంలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న వేళ ఉగ్రదాడి జరగడం కలకలం రేపింది.

Tags:    

Similar News